మహమ్మారికి అంతం లేదు : డబ్ల్యూహెచ్ ఓ కీలక ప్రకటన !

Update: 2020-05-14 09:31 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ వైరస్ ను ఓ మహమ్మరి  గా అభివర్ణించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..(WHO) తాజాగా మరో బాంబు పేల్చింది. ఈ మహమ్మారి ఎప్పటికి పోదని .. ఈ  వైరస్ తో కలిసి జీవించాల్సిందే అని  ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ  మహమ్మారి హెచ్ ఐ వీ లాంటిదని ఎప్పటికీపోదని హెచ్చరించింది. 'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు.

ఈ  మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని మీడియా ద్వారా వివరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ మైఖెల్ ర్యాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ  వైరస్ తో కలిసి జీవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు హ్యూమన్ ఇమ్యూనో వైరస్ .. HIV ఉన్న విధంగానే మానవ జీవితంలో ఈ  వైరస్ ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. ఐతే HIVని పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ.. అది సోకిన రోగుల జీవన ప్రమాణం పెరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

అలాగే, ఈ  వైరస్ ఎప్పటి వరకు అంతమవుతుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టంగా  ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఐతే దీనికి పటిష్టమైన వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కరోనావైరస్, లాక్‌ డౌన్ పరిమితులను ఎత్తివేయడం మరింత సంక్రమణను దారితీస్తుందన్నారు. ప్రాణాంతక మహమ్మారిని అంతం చేసే టీకా కోసం ఎదురు చూడకుండా  జాగ్రత్త  వహించాలన్నారు. దీన్ని నిరోధించగలిగే వ్యాక్సిన్  కనుగొని, దాన్ని ప్రతీ ఒక్కరికీ  అందుబాటులోకి తేగలినపుడు మాత్రమే దీన్ని అరికట్టవచ్చని ర్యాన్  స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను తగ్గించాలని యోచిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ  ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
Tags:    

Similar News