భారత్ లో కరోనా మృతులపై డబ్ల్యుహెచ్ ఓ వీడియో ట్విస్ట్ ఇదే

Update: 2021-04-06 12:59 GMT
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనితో దేశంలో ఉండే ప్రజలకి ఆందోళన పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో భారత్‌ లో కరోనా వైరస్ మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరుతో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 15నాటికి దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 50 వేలకు చేరుతుందన్నది ఆ వైరల్ వీడియో లోని సందేశం.

ఈ వీడియోపై ఇటు మీడియా వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. దీనిపై వివరణ ఇచ్చిన డబ్ల్యుహె ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం .ఈ వైరల్ వీడియో ఫేక్ ‌గా తేల్చేసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోతో తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేసింది. ఏప్రిల్ 15కల్లా భారత్‌ లో కరోనా వైరస్ మరణాల సంఖ్య 50 వేలకు చేరుతుందన్నట్లు తాము ఎలాంటి హెచ్చరిక వీడియోను విడుదల చేయలేదని , ఇది ఫేక్ న్యూస్‌ గా స్పష్టంచేసింది.

మరో నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, కోవిడ్ మూడో స్టేజ్‌ కి  చేరితే, అధిక జనాభా కలిగిన భారత్‌ లో మరణాల సంఖ్య 50 వేలకు చేరుతుందని ఆ వీడియోలో ఉంది. ఈ ఫేక్ వీడియోను WHO, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్  పేరిట విడుదల చేశారు.ఈ ఫేక్ వీడియో వాస్తవానికి గత ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే సోషల్ మీడియాలో దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tags:    

Similar News