ఇండియా డేంజర్​లో ఉంది జరభద్రం.. డబ్ల్యూహెచ్​వో హెచ్చరిక

Update: 2020-09-14 23:30 GMT
కరోనా కేసులు ఇండియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయని.. భవిష్యత్​లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చని.. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనదేశాన్ని డబ్ల్యూహెచ్​వో హెచ్చరించింది. లాక్​డౌన్​ ఎత్తేశాక మనదేశంలో కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్​ ఆరంభం నుంచి రోజుకు సగటున 1000మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో భారత్​లో పెరుగుతున్న కేసులపై డబ్ల్యూహెచ్​వో స్పందించింది. గత 24 గంటల్లో ప్రపవంచవ్యాప్తంగా 307,930 కేసులు నమోదయ్యాయని ఇప్పటికవరకు అత్యధిక కేసుల్లో ఇదే రికార్డని డబ్ల్యూహెచ్​వో పేర్కొన్నది. నిన్న ఒక్కరోజే 5,500మంది మరణించారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 917,417 చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్​వో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్​వో ఆందోళన చెందు తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.8 కోట్ల పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కాగా రోజువారి కేసుల్లో అమెరికా, భారత్​, బ్రెజిల్​ దూసుకుపోతున్నాయి.

ఏయే దేశంలో ఎన్నికేసులు?
డబ్ల్యూహెచ్​వో గణాంకాల ప్రకారం.. ఆదివారం మనదేశంలో 94,372 కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 45,523, బ్రెజిల్‌లో 43,718 కేసులు రికార్డయ్యాయి. దీన్నిబట్టి అమెరికా, బ్రెజిల్​ కంటే ఇండియానే కేసుల సంఖ్యలో దూసుకుపోతున్నది. గత 24 గంటల్లో భారత్​, అమెరికాలో సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోగా.. బ్రెజిల్​లో 874 మంది చనిపోయారు. ఒక్క ఆగస్టు నెలలోనే మనదేశంలో 20లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

మిగతా దేశాల్లో..
అమెరికా, భారత్​, బ్రెజిల్​ దేశాల్లో మెజార్టీ కేసులు నమోదవుతుంటే మిగతా దేశాల్లోనూ కేసుల సంఖ్య తక్కువేమి అక్కడా కేసులు పెరుగుతున్నాయి. యూరప్​లోనూ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతున్నది. పెరూ, ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలలో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా నిబంధనలు తొలగించాలంటూ ఆస్ట్రేలియాలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. సుమారు 250మంది మెల్‌బోర్న్‌ వీధుల్లో ఆందోళన చేపట్టారు.

న్యూజిలాండ్​ ఏ వ్యూహంతో అరికట్టింది
ప్రపంచదేశాలన్ని కరోనాతో సతమతమవగా న్యూజిలాండ్​ మాత్రమే పకడ్బందీ చర్యలతో కరోనాను అదుపులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 21 నుంచి న్యూజిలాండ్​ రాజధాని అక్లాండ్‌ సహా దేశవ్యాప్తంగా కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేస్తామని న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెన్‌ ప్రకటించారంటే ఆ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
టెస్ట్​, ట్రేస్​, ట్రీట్​ అనే విధానాన్ని అవలంభించడం వల్లే కరోనాను కంట్రోల్​ చేశామని ఆ దేశ ప్రధాని ప్రకటించారు.

ఇజ్రాయెల్​లో మళ్లీ లాక్​డౌన్​
ఇజ్రాయెల్​లో కరోనా తీవ్ర రూపం దాల్చుతున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో 1,53,000 కేసులు నమోదయ్యాయి. 1,108మంది మరణంచారు. దీంతో అక్కడ లాక్​డౌన్​ మళ్లీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే శుక్రవారం నుంచి ఈ లాక్‌డౌన్‌ అమలులోకి వస్తుంది.
Tags:    

Similar News