ఐపీఎల్ క్రికెటర్ ను ఆన్ లైన్ లో కలిసి ఒక అమ్మాయి తనను తాను డాక్టర్ గా పేర్కొంది. పరిచయం పెంచుకున్న ఆమె.. గత సీజన్ లో సదరు క్రికెటర్ ను అడిగిన విషయం షాకింగ్ గా మారింది. సదరు క్రికెటర్ ను బెట్టింగులో డబ్బులు పెట్టేందుకు సలహా అడగటం.. అలా చేయటం తప్పని.. చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అలా అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పినట్లుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది.
మీడియాలో ఈ స్టోరీ రావటానికి ముందే.. సదరు క్రికెటర్ తనకు ఎదురైన అనుభవాన్ని బీసీసీఐకు చెప్పారు కూడా. దీంతో.. బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. ఆ క్రికెటర్ తో చాట్ చేసిన సదరు మహిళ ఎవరన్న విషయాన్ని ఆరా తీశారు. ఈ క్రమంలో సదరు మహిళ డాక్టర్ కాదని..నర్సు అని తేలింది. అంతేకాదు.. సదరు మహిళ ప్రొఫెషనల్ బుకీ కాదని కూడా తేల్చారు. సదరు మహిళ ఆచూకీని గుర్తించిన అధికారులు ఆమెను విచారించారు.
ఈ విచారణలో బెట్టింగ్ కు సంబంధించి ఆమె నుంచి ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో విచారణ ముగిసింది. అయితే.. సదరు మహిళతో క్రికెటర్ కు మూడేళ్ల క్రితమే ఆన్ లైన్ లో పరిచయమైంది. తాను ఢిల్లీకి చెందిన వైద్యురాలిగా ఆమె పేర్కొంది. మీ అభిమానిని అని పరిచయం పెంచుకున్న ఆమె.. తర్వాత మాట్లాడుకునే వారు కానీ ఎప్పుడు కలవలేదు. అంతేకాదు.. కోవిడ్ సమయంలో సదరు క్రికెటర్.. ఆ మహిళతో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సలహాలు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ ఉదంతాన్నిచూసినప్పుడు సోషల్ మీడియాలో పరిచయమ్యే ఎవరైనా సరే.. వారి విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.