హోదా మీద మీరు రియాక్ట్ కండి. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడండి. అవసరమైతే ఢిల్లీ కి వెళతా. జాతీయ స్థాయి లో చక్రం తిప్పుతా లాంటి మాటలు చెప్పిన పవన్ కల్యాణ్.. ఢిల్లీ కి వెళ్లింది లేదు.. చక్రం తిప్పింది లేదు. ఇప్పటి వరకూ ఢిల్లీ టూర్ కు సంబంధించి తరచూ మాటలు మాత్రం చెప్పే పవన్.. తాజాగా మాత్రం అనూహ్యం గా దేశ రాజధాని కి వెళ్లిన వైనం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
జనసేనాని హటాత్తు గా ఢిల్లీకి చేరుకోవటం వెనుక అసలు కారణం ఏమిటి? ఏ ఎజెండా తో ఆయన ఢిల్లీకి వెళ్లారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవైపు కేంద్ర పెద్దల్ని కలిసేందుకు పవన్ వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంటే.. మరో వైపు జనసేన వర్గాలు మాత్రం ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం పై తాను చేస్తున్న పోరాటం.. తాను చేస్తున్న వాదనకు దన్ను కోసం కమల నాథుల అగ్ర నాయకత్వాన్ని కలిసేందుకు పవన్ వెళ్లారా? అన్నది ప్రశ్న గా మారింది. తన పై జరుగుతున్న వ్యక్తిగత ప్రచారానికి చెక్ చెప్పేందుకు వీలుగా కేంద్ర సాయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నారా? అన్నది ప్రశ్న గా మారింది. బీజేపీ అగ్రనేత నడ్డా తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
సాధారణం గా తన టూర్ కు సంబంధించిన అన్ని డిటైల్స్ మీడియా కు వెల్లడించే పవన్.. తన తీరుకు భిన్నం గా వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది. తన ఢిల్లీ టూర్ కు సంబంధించి వివరాల్ని గుట్టుగా ఉంచేసిన వైనం రోటీన్ కు భిన్నంగా ఉందంటున్నారు. ఢిల్లీ టూర్ ఎందుకన్న విషయం మీద ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వని పార్టీ వైఖరిపైనా పలువురు విస్మయం వ్యక్తమవుతోంది. పవన్ ఢిల్లీ పర్యటనను ఇంత గుట్టుగా ఉంచాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.