కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కానీ వైసీపీ అధినేత జగన్ కానీ ఒక ప్రశ్నను మాత్రం చాలా చక్కగా అడిగారు. అదే.. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అడ్డుకుంటున్నది ఎవరు? అని. నిజంగానే.. ఈ ప్రశ్న చాలా కీలకమైనది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని పదే పదే చెప్పింది. ఇప్పటికీ ఇస్తామనే చెబుతోంది. ఇక కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఆందోళనే చేస్తోంది. సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని అధికార పక్షం ప్రత్యేక హోదా కావాలంటోంది. ప్రతిపక్షాలన్నీ ఒక్కుమ్మడిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంటులో చేసినప్పుడు మిగిలిన విపక్షాలన్నీ ప్రత్యేక హోదాకు అంగీకరించాయి. దానిపై మాట్లాడాయి. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఇప్పటి వరకు ఒక్క పక్షం కూడా చెప్పలేదు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ తెలంగాణలోని టీఆర్ ఎస్, తమిళనాడులోని అన్నాడీఎంకే లేఖలు రాసినా..అవి రెండూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కావు. వాటికి ఉన్న బలం కూడా తక్కువే. మిగిలిన విపక్షాలు ఏవీ హోదాను వ్యతిరేకించడం లేదు. కేబినెట్ తీర్మానం అయిపోయింది. ఎన్డీసీకి సిఫారసు అయిపోయింది. ఇక ఆమోదించాల్సింది ఎన్డీసీ ఒక్కటే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి అధ్యయనం చేయాల్సింది ఏముంటుంది? ఆర్థిక శాఖ తలబద్దలు కొట్టుకోవాల్సింది ఏముంటుంది? దీనిపై కేంద్రం ఎందుకింత రాద్ధాంతం చేస్తోంది? వెంకయ్య నాయుడు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలు.