పార్లమెంట్ నియోజకవర్గంం : కాకినాడ
టీడీపీ: చలమశెట్టి సునీల్
వైసీపీ: వంగ గీత
జనసేన: జ్యోతుల వెంకటేశ్వర్ రావు
టీడీపీకి కంచుకోటగా ఉన్న కాకినాడ పార్లమెంట్ నియోజకర్గంలో పోరు రసవత్తరంగానే ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన తోట నర్సింహం వైసీపీలోకి మారారు. దీంతో ఇక్కడి ఎంపీ సీటును చలమశెట్టి సునీల్ కు కట్టబెట్టింది టీడీపీ. ఇక వైసీపీ నుంచి వంగా గీత, జనసేన నుంచి జ్యోతుల వెంకటేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పోటీ నామమాత్రంగానే ఉండడం గమనార్హం. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్ లో ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్యే పోరు సాగుతోంది.
* కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం చరిత్ర:
అసెంబ్లీ నియోజకవర్గాలు:తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, పెద్దంపేట
ఓటర్లు:14 లక్షల 18 వేలు
1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 16సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పదిసార్లు, టీడీపీ ఐదుసార్లు, సీపీఐ, బీజేపీలు చెరోసారి గెలుపొందాయి. పార్టీలు ఏవైనా కాపు నేతలే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
* వైసీపీ నుంచి టీడీపీలో చేరిన చలమశెట్టి సునీల్:
2009లో రాజకీయారంగేట్రం చేసిన సునీల్ ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ కండువా కప్పుకున్న సునీల్ ప్రస్తుతం ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెబుతున్నారు. మరోవైపు టీడీపీ కేడర్ బలంగా ఉండడంతో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక రెండుసార్లు ఓడిపోయిన ఆయనపై సానుభూతితో ఓట్లు పడే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నారు.
* అనుకూలతలు:
-టీడీపీ బలంగా ఉండడం
-గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేపట్టడం
-రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి
* ప్రతికూలతలు:
-వరుసాగా ఓటమి పాలవ్వడం
-సిట్టింగ్ ఎంపీ తోట నర్సింహం వైసీపీలో చేరడం
* వంగ గీతా వైసీపీ నుంచి బలంగా..
టీడీపీలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన వంగ గీత ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పిఠాపురం స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు స్థానాల్లో అభ్యర్థుల వేట కొనసాగిస్తున్న సమయంలో జగన్ మదిలో వంగ గీత పేరొచ్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన గీత ఇక్కడి కాపు ఓట్లతో గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. దీంతో ఆమె పార్టీలో చేరితే ఎంపీ టికెట్ ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. అనుకున్నట్లుగానే గీత వైసీపీలోకి చేరారు. ఆమెకు ఎంపీ టికెట్ కట్టబెట్టారు జగన్. కాకినాడలో ఉన్న కాపు ఓట్లే తనను గెలిపిస్తాయని ఆమె బలంగా నమ్ముతున్నారు. వైసీపీ గాలి, అధికార పార్టీపై వ్యతిరేకత కలిసి వస్తుందని నమ్ముతున్నారు.
* అనుకూలతలు:
-కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం

-పార్టీ పుంజుకోవడం
* ప్రతికూలతలు:
-కొత్తగా ఎంపీ స్థానంలో పోటీ
- కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండడం
*త్రిముఖ పోరు లో గెలిచేదెవరు?
కాకినాడు పార్లమెంట్ సెగ్మెంట్ లో కాపు సామాజిక ఓట్లు అభ్యర్థుల గెలుపును నిర్ణయిస్తాయి. దీంతో ఇక్కడ జనసేన కూడా బరిలో నిలుచుంది. ఆ పార్టీ నుంచి జ్యోతుల వెంకటేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి కొత్తగా వంగ గీత బరిలోకి దిగుతున్నా.. ఆమెకు రాజకీయాలు కొత్త కాదు. గతంలో పనిచేసిన అనుభవం, పార్టీ ఇమేజ్ తో నెట్టుకు రావచ్చని అంటున్నారు. ఈ పరిణామ క్రమంలో సానుభూతి ఓట్లు, టీడీపీ కేడర్ తో ఈసారి ఎంపీగా గెలుస్తానని చలమశెట్టి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కాకినాడ గడ్డపై ఎవరు నెగ్గుతారనేది ఆసక్తిగా మారింది.