డ్రగ్స్ దోషులను ఎందుకు దాస్తున్నారు: హైకోర్టు

Update: 2021-04-30 02:30 GMT
తెలంగాణలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసు వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ పై తాజాగా హైకోర్టు విచారణ జరిపింది.

2016 నాటి కేసులు సీబీఐకి, ఈడీకి ఇవ్వడం లేదంటూ న్యాయవాది రచనారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసు వివరాలను తమకు ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది.ఎఫ్ఐఆర్ లు, ఛార్జీషీట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును కోరింది.

దీనిపై స్పందించిన హైకోర్టు ఈడీకి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. డ్రగ్స్ కేసుల నిందితులను దాచిపెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీసింది.ఈ మేరకు డ్రగ్స్ పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తోందని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
Tags:    

Similar News