మూగ‌బోయిన హుజూరాబాద్‌.. ఏం జ‌రిగింది?

Update: 2021-08-20 14:30 GMT
నిన్న మొన్న‌టి వ‌రకు అక్క‌డ మైకులు హోరెత్తాయి. చెవులు చిల్లులు ప‌డేలా.. నాయ‌కుల ప్ర‌సంగాలు జోరెత్తాయి. స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్ల‌తో నాయ‌కులు రెచ్చిపోయారు. ఇక‌, అధికార టీఆర్ ఎస్ పార్టీ నిత్యం.. ఏదో ఒక ప్ర‌క‌ట‌న తో.. ఇక్క‌డ పుంజుకుంది. అదేస‌మ‌యంలో మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఇక్క‌డ జోరుగా ప్ర‌చారం చేశారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు.. తుఫాను ముంద‌టి ప్ర‌శాంత ఏర్ప‌డింది. ఎవ‌రూ ఎక్క‌డ నోరు విప్ప‌డం లేదు. అంతా సైలెంట్‌. ఎక్క‌డా.. ఎవ‌రూ.. ఎలాంటి కార్య‌క్ర‌మాలూ నిర్వ‌హించ‌డం లేదు. మ‌రి ఎందుకుఇలాజ‌రిగింది? అస‌లు ఎందుకు అంద‌రూ సైలెంట్ అయ్యారు?

ఇవే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే ఉమ్మ‌డి క‌రీం న‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు, ఒక‌ప్పుడు టీఆర్ ఎస్‌కు కీల‌క నాయ‌కుడిగా ఎదిగిన‌.. ఈట‌ల రాజేంద‌ర్‌.. ఇటీవల పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం.. రాజీనామా చేయ‌డం.. వంటి ప‌రిణామాల‌తో ఇక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చింది. అయితే.. దీనికి సంబందించి కేంద్ర ఎన్నిక ల‌సంఘం.. ఎలాంటి నోటిఫికేష‌న్ ఇవ్వ‌కుండానే .. పార్టీలు అభ్య‌ర్థులు కూడా.. ఇక్క‌డ జోరుగా ప్ర‌చారం సాగించారు.

ఈట‌ల ఏకంగా పాద‌యాత్ర ప్రారంభించారు. అధికార పార్టీ కూడా ఏకంగా.. ద‌ళిత బంధు పేరుతో ప‌థ‌కా న్ని ప్ర‌చారం చేసింది. అదే స‌మ‌యంలో.. నియోజ‌క‌వ‌ర్గానికి రూ.2000 కోట్లు కేటాయించింది. ఇక‌, బీజేపీ నేత‌లు కూడా యాత్ర‌లు చేప‌ట్టారు. అంటే.. ఎన్నిక‌ల‌కు ఇంకా నోటిఫికేష‌న్ లేకుండానే.. రాకుండానే అన్ని వైపుల నుంచి.. భారీ స్థాయిలో ప్రచార జోరు అందుకుంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. మాదే గెలుపు ! అని స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు చేసుకున్నారు. ఈట‌ల దంప‌తులు పాద‌యాత్ర పేరుతో వ్యూహానికి దిగారు. దీంతో ఒక్క‌సారిగా హుజూరాబాద్‌పై అంచ‌నాలు పెరిగిపోయి.. నిత్యం దీనికి సంబంధించిన వార్త‌లు పుంఖానుపుంఖాలుగా వ‌చ్చాయి.

కానీ, అనూహ్యంగా గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ మైకులు మూగ‌బోయాయి. నాయ‌కులు ప్ర‌చార జోరు త‌గ్గించారు. మంత్రి హ‌రీష్‌రావు కూడా హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. టీఆర్ ఎస్ నాయ‌కులు.. కూడా త‌న ప్ర‌చారం త‌గ్గించారు. ఇక‌, ఈట‌ల.. త‌న మోకాలికి గాయం అయిందంటూ.. పాద‌యాత్ర‌ను ప‌క్క‌న పెట్టారు. అదేస‌య‌మంలో ఆయ‌న స‌తీమ‌ణి కూడా నెమ్మ‌దించారు. ఇలా.. మొత్త‌గా చూస్తే.. అంద‌రూ సైలెంట్ అయిపోయారు. మ‌రి ఇలా ఎందుకు జ‌రిగింది?  అంటే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం .. ఇప్ప‌ట్లో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వ‌హించే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డ‌మే.

ఎందుకంటే దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌కు సంబంధించిన భ‌యం వెంటాడుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడే ఇక్క‌డ ఉప పోరుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సిద్ధంగా లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచి ప్ర‌చారం చేయడం ఎందుకు భారీ ఎత్తున డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డం ఎందుకు? అని నాయ‌కులు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి హుజూరాబాద్ ఇలా ఉవ్వెత్తున ఎగ‌సి.. అలా.. తెర‌మ‌రుగైంద‌నే వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News