బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తే.. ఇక‌, తిరుగులేదు!

Update: 2020-10-23 06:00 GMT
ఏదేమైనా అనుకున్న‌ది సాధించి తీరాల‌నే నాయ‌కుల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక‌రు. నిజానికి రాజ‌కీయాల్లో ఇంత ప‌ట్టుద‌ల ఉండే నాయ‌కులు చాలా చాలా త‌క్కువ మంది ఉంటారు. రాష్ట్రంలో ప‌రిపాల‌న విష‌యంలో కానీ,పార్టీని నిలబెట్టుకునే విష‌యంలో కానీ, ఆయ‌న వేసిన అడుగులు .. వేస్తున్న వ్యూహాలు నిజంగానే ఆయ‌న‌లో చాలా ప‌ట్టుద‌ల ఉంద‌నే విష‌యాన్ని ప్ర‌స్ఫుటంగా క‌ళ్ల‌కు క‌డ‌తాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అయితే, వీటిలో ప్ర‌ధానంగా ఇప్ప‌టికీ బాబు చింతించే కీల‌క అంశం.. బీజేపీతో దూరం కావ‌డం.

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల్లోకి వెళ్లారు. గెలుపు గుర్రం ఎక్కారు కేంద్రంలో మంత్రి ప‌ద‌వులు తెచ్చుకున్నారు. ఇక‌, ఏపీలోనూ బీజేపీకి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే, 2017 చివ‌రి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు వంటి విష‌యాల్లో ఇరు పార్టీల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. దీంతో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో బీజేపీకి దూర‌మ‌య్యారు. ఎప్పుడు దీనిపై చ‌ర్చ జ‌రిగినా.. బీజేపీకి దూరంగా ఉండ‌కుండా ఉంటే బాగుండేద‌నే అభిప్రాయం పార్టీలోనూ వినిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు దాదాపు ఏడాది కింద‌ట నుంచే ప్రారంభించారు.

త‌న పార్టీ త‌ర‌ఫున రాజ్యస‌భ‌కు ఎన్నికైన అభ్య‌ర్థులు న‌లుగురు బీజేపీలో చేర‌డం వెనుక బాబు వ్యూహ‌మే ఉంద‌ని అంటారు. కానీ, ఇది ఏమాత్రం నిజ‌మో తెలియ‌దు కానీ.. బాబు త‌ర‌చుగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని ఆకాశానికి ఎత్తేయ‌డం చూస్తే.. ఖ‌చ్చితంగా ఆయ‌న బీజేపీతో చేతులు క‌లిపేందుకు రెడీగానే ఉన్నార‌ని అనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు బీజేపీ మ‌న‌సంతా జ‌గ‌న్ చుట్టూ తిరుగుతోంది. అయినా కూడా బాబు ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి మాదిరిగా ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయ‌న కేంద్రమంత్రి అమిత్‌షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అక్టోబరు 22న అమిత్‌షా పుట్టినరోజు.. ఈ సందర్భంగా అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.  అంతేకాకుండా కేంద్రంలో మ‌రో మంత్రి, బాబుకు స్నేహితుడు కూడా అయిన‌ పీయూష్ గోయల్‌కు కూడా చంద్రబాబు ఫోన్  చేశారు. పీయూష్ గోయెల్ కిడ్నీలో రాళ్ల తొలగింపు చికిత్స చేయించుకోనున్న విషయం తెలిసిందే. గోయల్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అయితే, ఈ ప‌రామ‌ర్శ‌ల వెనుక బాబు వ్యూహం బీజేపీకి చేరువ కావ‌డ‌మేన‌న్న‌ది ఢిల్లీ వ‌ర్గాల మాట‌. ఇక‌, బీజేపీ కూడా నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. బాబుతో క‌లిసేందుకు ముందుకు వ‌స్తే.. తిరుగు ఉండ‌ద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News