మసీదు పై ఎర్రజెండా.. మూడో ప్రపంచ యుద్ధమే..

Update: 2020-01-06 09:05 GMT
పశ్చిమ ఆసియా లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ సైన్యాధిపతి ఖాసీ సులేమానీని ఇరాక్ లో చంపిన అమెరికా చర్యతో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా చర్యలతో ప్రతిచర్యలను ఇరాన్ ప్రారంభించింది. ఇరాక్ లోని అమెరికా సేనలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.

అమెరికా సైతం ఇరాక్ లోని ఇరాన్ మిలీషియా సంస్థల వాదులపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇరాక్ కేంద్రంగా అమెరికా, ఇరాన్ యుద్ధం ఆల్ రెడీ ప్రారంభమైపోయింది.

తాజాగా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2015లో చేసుకున్న అణు నియంత్రణ ఒప్పందాన్ని పక్కనపెట్టింది. యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచుకోవడానికి రెడీ అయ్యింది. అణుబాంబుల తయారీకి ఇరాన్ పూనుకోవడంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న టెన్షన్ మొదలైంది. తమ సైన్యాధిపతిని చంపిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది.

ఇక ఇరాన్ లోని పవిత్ర పురాతన జంకారా మసీద్ డోమ్ పై ఎర్రజెండాను ఇరాన్ ఎగురవేసింది. ఈ జెండా అర్థం యుద్ధానికి సన్నద్ధమని.. దీంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న సంకేతాలు ఏర్పడ్డాయి.

ఇక ఇరాన్, అమెరికా దాడులు ప్రతీదాడులతో ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లో నెత్తురు ఏరులు పారుతున్నాయి. ఈ మారణహోమంతో అమెరికా తమ దేశం నుంచి వైదొలగాలని తాజాగా ఇరాక్ పార్లమెంట్ తీర్మానం చేసింది. కానీ తాము వైదొలగమని.. ఇరాక్ ఒత్తిడి తెస్తే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.


Tags:    

Similar News