జగన్ విశాఖనే ఎందుకు ఎంచుకున్నారు?

Update: 2019-12-18 05:37 GMT
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరమని అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన ప్రకటన అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయా ప్రాంతాల వారు హర్షిస్తున్నారు. సౌతాఫ్రికా దేశానికి ఉండగా లేని ఏపీకి ఎందుకు ఉండకూడదని జగన్ ప్రశ్నించారు.పరిపాలన కేంద్రంగా విశాఖ, కర్నూలులో జ్యూడిషియరీ కేపిటల్, అమరావతిలో చట్టసభలు ఏర్పాటు చేయాలనే ఆలోచనను జగన్ చేశారు.

సచివాలయం సహా పరిపాలనను విశాఖ నుంచే చేయాలన్న జగన్ ఆలోచనకు కారణమేంటి? విశాఖనే జగన్ ఎందుకు ఎంచుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

విశాఖలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. పైగా సముద్రతీరం ప్రాంతం కావడంతో ఆహ్లాద, అనువైన వాతావరణం ఉంది. ఇక ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో ఉద్యోగులకు కావాల్సిన మౌళిక సదుపాయాలన్నీ ఉన్నాయి. ఒక్క మెట్రో రైలు తప్పితే పరిపాలనకు కావాలసిన అన్ని వసతులు విశాఖలో ఉన్నాయని జగన్ ప్రకటించారు. ఇవన్నీ వసతులు ఉన్నాయి కాబట్టే అప్పుల్లో ఉన్న ఏపీకి విశాఖ అయితేనే పరిపాలనకు బెటర్, ఖర్చు తగ్గుతుందని జగన్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

నిపుణుల కమిటీ కూడా ఇదే ప్రతిపాదన చేస్తే ఏపీకి పరిపాలన కేంద్రంగా విశాఖ మారడం ఖాయం. ఇదే జరిగితే అమరావతిలో కేవలం చట్టసభలు మాత్రమే కొనసాగుతాయి. విశాఖ నుంచే పాలన సాగనుంది.
Tags:    

Similar News