జూన్ 21నే యోగా దినోత్సవం ఎందుకంటే?

Update: 2019-06-21 10:30 GMT
జూన్ 21... అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ యోగాసనాలు వేస్తూ డేని జరుపుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా జార్ఖండ్ రాష్ట్రంలో యోగాడేని యోగాసనాలు వేసి ఘనంగా నిర్వహించారు.

*యోగా డే ఎప్పటి నుంచి.?
2015 సంవత్సరం నుంచి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా ఉన్న దేశాల్లో  ప్రజలు ఈ యోగాడేను జరుపుకుంటున్నారు. ఈ రోజు కూడా రాజకీయ నాయకులు, సెలెబ్రెటీలు, సినీ తారలు, విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. యోగాసనాలు వేశారు.

*మోడీ కృషికి ఐరాస ఆమోదం..
ప్రధాని నరేంద్రమోడీ మన ప్రాచీక సంస్కృతిక విప్లవమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు 2014లో సెప్టెంబర్ 27వ తేదీన ఐక్యరాజ్యసమితి సమావేశంలో దీని ప్రాముఖ్యతను వివరించి జూన్ 21న అంతర్జాతీయ యోగా డేను నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనికి ప్రపంచంలోని 170కు పైగా దేశాలు ఆమోదించాయి. దీంతో అప్పటి నుంచి యోగా డేను నిర్వహిస్తున్నారు.

*జూన్ 21న యోగే డే ఎందుకు?
ఏడాదిలో ఉండే 365 రోజుల్లోనూ జూన్ 21వ తేదీకి ఓ ప్రత్యేక ఉంది. ఈరోజున ఉత్తర అకాంక్షంలో పగటి సమయం ఎక్కువ. సూర్యుడు ఇదే రోజున ఉత్తరార్థ గోళం నుంచి దక్షిణార్థగోళానికి ప్రయాణించడం మొదలు పెడుతాడు. ఇక భారతీయ ఇతిహాసాలు శాస్త్రాల ప్రకారం.. ఆది గురువు , దేవుడైన శివుడు యోగా గురించిన విజ్ఞానాన్ని దేవతలకు చెప్పిన రోజట.. యోగాతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ఈరోజు మంచిదట.. సూర్యుడి పగటి కాలం ఎక్కువగా ఉండే ఈరోజు ప్రకృతిలోని శక్తులన్నీ ఉత్తేజితమయ్యే రోజుగా చెబుతుంటారు.అందుకే ఈరోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపాదించారు. భారత ఐరాస ప్రతినిధి అశోక్ ముఖర్జీ 2014 డిసెంబర్ 11న డ్రాఫ్ట్ రిజల్యూషన్ పెట్టగా అది ఆమోదం పొందింది.

దీంతో తరువాతి ఏడాది అయిన 2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు.  ఇలా యోగా దినోత్సవం జూన్ 21న పెట్టడం వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలుకూడా ఉన్నాయి.
Tags:    

Similar News