తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన చేసిన పని గురించి ఆసక్తిగా మాట్లాడుకోవటం కనిపిస్తుంటుంది. ఏపీకి చెందిన చాలామంది నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. వాటిని బయటపెట్టటానికి పెద్దగా ఇష్టపడరు. మారిన పరిస్థితుల్లో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక.. చాలామంది పాత మిత్రులు వచ్చి ఆయనకు తమ ఇంట్లో జరిగే శుభ కార్యాలకు రావాల్సింది గా ఆహ్వానాలు ఇచ్చినా.. ప్రత్యేకంగా వెళ్లింది మాత్రం చాలా తక్కువ వాటికే.
అలా వెళ్లిన వాటిల్లో చాలా మందికి అలా గుర్తుండి పోయింది మాత్రం పరిటాల రవి.. సునీత పుత్రరత్నం పరిటాల శ్రీరాం పెళ్లికి వెళ్లటం. హెలికాఫ్టర్ లో పరిటాల వారి ఊరికి వెళ్లి మరీ.. కొత్త దంపతుల్ని ఆశీర్వదించి మరీ వచ్చారు. ఆ సందర్భంగా తన వెంట పలువురిని తీసుకెళ్లటం.. అందులో ఒక మీడియా అధినేత ఉండటం అప్పట్లో ఆసక్తికరమైన చర్చ నడిచింది.
ఈ సందర్భంలోనూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్.. ఆయన తో ఏకాంతంగా మాట్లాడటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తన వెంట రావాలని అడిగి మరీ తీసుకెళ్లిన కేసీఆర్ తీరుతో పయ్యావులకు గులాబీ బాస్ అంత దగ్గరా? అన్న చర్చ నడిచింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా పరిటాల వారింట్లో మరో శుభకార్యం జరుగుతోంది.
వారి మరో కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని గండిపేట లోని రిథిరా రిట్రీట్ రిసార్ట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు నారా లోకేశ్ తో పాటు.. పలువురు టీడీపీ నేతలు మాత్రమే కాదు.. ఈ మధ్యనే బీజేపీ లోకి వెళ్లిన సుజనా లాంటోళ్లు కూడా హాజరయ్యారు. పలువురు రాజకీయ నేతలు.. సినిమా సెలబ్రిటీలు హాజరైన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ మాత్రం దూరంగా ఉండటం గమనార్హం. పరిటాల శ్రీరామ్ పెళ్లి వేడుక్కి హెలికాఫ్టర్ వేసుకొని మరీ రాప్తాడు వెళ్లిన కేసీఆర్.. ఊళ్లో జరిగిన ఎంగేజ్ మెంట్ కు ఎందుకు వెళ్లలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.