జన్మాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుడు నెమలి ఫించాన్ని ఎందుకు ధరిస్తాడు? చేతిలోని వేణువు ఎందుకు?

Update: 2022-08-19 04:21 GMT
ఇవాళ జన్మాష్టమి. నిజానికి కేరళ.. కర్ణాటక రాష్ట్రాల్లో నిన్ననే (గురువారం) చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఈ రోజు చేస్తుంటే.. మరికొందరు రేపు చేస్తున్నారు. ఇక.. శ్రీవైష్ణవులు మాత్రం శనివారం రాత్రి వేళలో ఈ పండుగను జరుపుకుంటున్న పరిస్థితి. పండుగ ఎప్పుడు జరుపుకున్నా.. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు లోగిళ్లలో ఉండేసందడి అంతా ఇంతా కాదు. చాలామంది ఇళ్లల్లో తమ చిన్నారులను చిట్టి కన్నయ్యగా తయారు చేసి.. బియ్యపు పిండి నీటిలో వారి పాదాలు ఉంచి.. ఇంటి నేల మీద అచ్చు వేయించటం లాంటివెన్నో చేస్తుంటారు.

మిగిలిన హిందూ దేవతామూర్తులతో పోలిస్తే.. శ్రీకృష్ణుడు చాలా భిన్నం. ఆయన అత్యంత శక్తివంతుడిగా కనిపిస్తారు. ఆ మాటకు వస్తే.. ఈ భూమి మీద పుట్టిన దేవతామూర్తిగా ఆయన్ను చెప్పొచ్చు. వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు మనిషి అంశలో పుట్టినట్లుగా సాక్ష్యాలు చెప్పేవాళ్లు.. దానికి తగ్గ వాదనలు వినిపించేవారు లేకపోలేదు. శ్రీకృష్ణుడి తత్త్వం గురించి ఈ మధ్యన విడుదలైన కార్తికేయ 2లో చెప్పిన విధానం చాలామందిని తన్మయత్వానికి గురి చేసింది. శ్రీకృష్ణుడ్ని ఎంత చక్కగా వివరించారు.

అతని తత్త్వాన్నిఎంత బాగా చెప్పారన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉండటం తెలిసిందే. మిగిలిన హిందూ దేవుళ్లకు కాస్తంత భిన్నంగా శ్రీకృష్ణుడి తీరు కనిపిస్తూ ఉంటుంది. అతని తలలో ఎప్పుడూ నెమలి ఫించం.. చేతిలో వేణువు ఎంుదకు ఉంటుంది? దాని వెనకున్న రహస్యం ఏమిటి? అన్న ప్రశ్న మదిలో మెదిలినా.. దాని సమాధానాలు తక్కువ మందికే తెలుసు. ఈ రోజు

జన్మాష్టమి సందర్భంగా ఆ ఆసక్తికర విషయాల్ని  తెలుసుకుందామా?

శ్రీకృష్ణుడు అన్నంతనే పదహారు వేల మంది గోపికలతో సరసాలు ఆడేసిన దేవతా మూర్తిగా అభివర్ణిస్తారు. దీనికి ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేస్తారు. నాస్తికుల విషయం తెలిసిందే. వారికి తెలిసిన విషయాల కంటే తెలియనివే ఎక్కువ. హిందూ పురాణాల్నివారు చూసే ధోరణి.. విమర్శించే తీరు ఎలా ఉంటుందో తెలిసిందే. వారు చేసిన దుర్మార్గం ఏమంటే.. తాము నమ్మనిదానికి సంబంధించిన విషయాల్ని తమ సొంత పైత్యాన్ని జొప్పించి తప్పుడు ప్రచారాలు చేయటం.. పురాణాలకు తప్పుడు భాష్యాలు చెప్పటం ద్వారా ప్రజల మనసుల్ని కలుషితం చేయటంతో పాటు వారిలో వక్ర ఆలోచనలకు కారణమయ్యారని చెప్పాలి.

శ్రీకృష్ణుడు విషయానికి వస్తే అతన్ని అస్థలిత బ్రహ్మచారిగా అభివర్ణిస్తారు. ఎనిమిది మంది భార్యలతో.. 16 వేల మంది గోపికలతో సరసాలాడిన సంగతో? అంటూ ప్రశ్నించొచ్చు. అదే శ్రీకృష్ణ త్తత్వంగా అభివర్ణిస్తారు. చాలామంది సామాన్యులు అనుకునేలా శ్రీకృష్ణుడు తన భార్యలతో సహా ఎవరితోనూ ఆయన శృంగారం చేయలేదు. నెమలి ఫించం ధరించిన గోపికలు నల్లనయ్య తమతో ఉన్నట్లు వారంతా భావించారు. యోగులందరిలో  శ్రీకృష్ణుడు పరమయోగి. తనకు ఎనిమిది మంది భార్యలు.. 16 వేల మంది గోపికలు ఉన్నా.. ఆయన అసలుసిసలు బ్రహ్మాచారిగా చెబుతారు.

అందుకే ఆయన్ను అస్థలిత బ్రహ్మాచారిగా అభివర్ణిస్తారు. పెళ్లి చేసుకున్నప్పటికి శ్రీకృష్ణుడు పూర్తిగా స్వచ్ఛమైన ఇంద్రియ కోరికలు లేని వాడిగా చెబుతారు. కన్నయ్యను కొందరు నల్లనయ్య అంటే మరికొందరు అతని రూపం నీలంగా చెబుతారు. నిజానికి ఈ రెండు వాస్తవాలే అంటారు.
అదెలానంటే.. నెమలి ఫించం ెలా అయితే పగలు నలుపు.. రాత్రి నీలంలో కనిపిస్తాయో.. నల్లనయ్య కూడా అలానే అని చెబుతారు.

నెమలి ఈకను ధరించటం వెనుక ఆ పరమాత్మ తాను చెప్పాలనుకున్న దానిని నెమలి ఫించంతో చెప్పంతో చెప్పేస్తారంటారు. నెమలి ఫించానికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. మయూరానికి ఉండే నెమలి ఫించంలో.. 'మ' కారం మధనానికి అర్థమని.. 'యూర' అంటే హృదయం అని చెబుతారు. పక్షి జాతుల్లో యోగ విద్య తెలిసిన పక్షులు కేవలం ఐదే. వాటిలో శుకం, గరుడు, హంస, పావురం, నెమలి. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఞానం ఉంటుంది. నెమలి ఈకలను అందానికి ప్రతీకలుగా భావిస్తారు.

పురాణాల ప్రకారం నెమళ్లు అత్యంత పవిత్రమైనవిగా చెబుతారు. వాటి ప్రత్యేకత ఏమంటే.. క్రౌంచపక్షి దేవతా పక్షి కావడం వల్ల ఎంతటి దాహమేసినా భూమిలోని నీటిని తాగవు. వర్షాలు పడే వేళలో స్వచ్ఛమైన తొలకరి చినుకలు భూమి మీద పడే ముందే.. అవి తమ దాహాన్ని తీర్చుకుంటాయి. అంతేకాదు నెమళ్లు తమ పునరుత్పత్తి కోసం కలయికలో పాల్గొనవు. కేవలం తమ కన్నీళ్లతోనే తమ సంతానాన్ని పెంచుకుంటాయి. ఈ సృష్టిలో కలయికలో పాల్గొనని ప్రాణి నెమలి ఒక్కటే.

నెమలి తమ వీర్యాన్ని ఊర్ద్వముఖంగా నడిపించే శక్తి కలిగి ఉంటాయి. మనిషి స్థాయి కంటే తక్కువగా ఉండటం వల్ల ఈ వీర్యం పల్చని జిగురు రూపంలో కంట్లోని గ్రంధుల నుంచి బయటకు వస్తాయి. ఇవి ఒకరకమైన మదపు వాసనతో ఉండటం వల్ల ఆడనెమళ్లను ఆకర్షిస్తాయి. ఆడ.. మగ.. జననేంద్రియాల మాదిరి కలయికతో పాల్గొనటం నెమళ్లలో కనిపించవు. అందుకే నెమళ్లను అర్థస్థలిత బ్రహ్మచారులుగా అభివర్ణిస్తారు. అందుకే పరమయోగి అయిన శ్రీకృష్ణుడు తన తలపై నెమలి ఫించాన్ని ధరిస్తారని చెబుతారు.

చేతిలోని పిల్లనగోవి రహస్యం ఏమిటన్నది చూస్తే.. మాధవుడు ఒక రోజు వేణువు ఊదాలని అనుకుంటాడు. తన సంగీతంతో నెమళ్లు నాల్యం చేయటం.. అడవిలోని జీవులన్నీ అతడి వేణుగానానికి మంత్రముగ్ధులైపోయాయి.వేణువు ఒక మధురమైన వాయిద్యం. అదెప్పుడూ మనం సంతోషంగా ఉండాలని.. ఆనందాన్ని పంచుకునేందుకు ప్రయత్నించాలని తెలియజేసే విషయాన్ని తన పిల్లనగోవితో మాధవుడు చెప్పే ప్రయత్నం చేశారంటారు. అందుకే ఏ సందర్భంలోనూ శ్రీకృష్ణుడి చేతిలో వేణువు.. శిరస్సుపైన నెమలి ఫించం ఉండేది అందుకే.
Tags:    

Similar News