కీలక స్థానాల్లో ఉన్న అధికారుల ఈ మధ్యన తరచూ వివాదాల్లోకి కూరుకుపోతున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే చట్టాన్ని తుంగలోకి తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. అనైతిక సంబంధాలతో వారు వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నించేలా ఉండటమే కాదు.. ఇలాంటి ధోరణి ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.
ఈ మధ్యనే పోలీసు శాఖకు చెందిన ఒక మహిళా అధికారిణి.. మరో పోలీసు అధికారితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారంటూ.. భర్త.. అతడి కుటుంబ సభ్యులు పట్టుకోవటం.. మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేయటం తెలిసిందే. ఇదే తీరులో మరికొన్ని ఉదంతాలు వెలుగు చూశాయి. తాజాగా అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఆర్మ్ డ్ రిజర్వ్ డీసీపీగా వ్యవహరిస్తున్న కె.బాబురావు సతీమణి వేదశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. నలుగురు పిల్లలు ఉన్న తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆమె ఫిర్యాదు చేశారు. తనకు బంధువైన బాబురావుతో 1983 జూన్ 8న తనకు పెళ్లి అయ్యిందని.. అప్పటి నుంచి ఆకారణంగా తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నట్లుగా ఆమె ఆరోపించారు. ఇలా చేయటం తప్పని చెప్పిన తనను కొడుతున్నారని.. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు కూర్చొని మాట్లాడినా తన పద్ధతిని మార్చుకోలేదని ఆమె వాపోయారు.
తనను తీవ్రంగా వేధిస్తున్నాడని.. తాజాగా తన భర్తతో సహజీవనం చేస్తున్న మహిళ సైతం తనను బెదిరింపులకు గురి చేస్తుందని ఆమె వెల్లడించారు. ముగ్గురు ఆడపిల్లలు.. ఒక అబ్బాయి ఉన్న తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. పోలీస్ శాఖకు సంబంధించి వెలుగు చూస్తున్న వ్యవహారాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.