దారుణాల మీద దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం బయట వ్యక్తుల్ని నమ్మలేని పాడు రోజులు వచ్చాయని బాధ పడుతున్న దానికి మించిన దరిద్రం ఇప్పుడు జనాల్ని ముంచెత్తేలా ఉంది. బయటోళ్ల సంగతి తర్వాత ఇంట్లో వాళ్లను సైతం నమ్మలేని దారుణ పరిస్థితులు ఇప్పుడు వచ్చేస్తున్నాయా? అంటే అవునన్న మాట చెప్పక తప్పదు.
కట్టుకున్న భర్తను.. ప్రియుడి కోసం చంపేస్తున్న వైనాలు ఈ మధ్యన బయటకు వస్తున్నాయి. అదే సమయంలో విలాసాలు.. అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న వైనాలు వెలుగు చూస్తే.. భయాందోళనలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వాటికి మించిన దారుణ ఘటన ఒకటి గోవాలో చోటు చేసుకుంది. చదివినంతనే షాక్ తగిలేలా ఉన్న ఈ ఉదంతంలో నలుగురు ప్రియుల కోసం కట్టుకున్న భర్తను హతమార్చిన భార్య వైనం దిమ్మ తిరిగేలా చేయటం ఖాయం. ఈ ఉదంతంలోకి వెళితే..
కర్ణాటకకు చెందిన భార్యభర్తలు ఇద్దరు బతుకు దెరువు కోసం తమ ఇద్దరి పిల్లల్ని తీసుకొని గోవాకు వచ్చారు. భార్యపేరు కల్పన బసు కాగా.. భర్త పేరు బసురాజ్ బసు. కారు డ్రైవర్ గా పని చేసే బసురాజ్ బసు.. పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కల్పన.. తన భర్త స్నేహితులతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఒక్కరితో కాకుండా నలుగురితో సంబంధాలు పెట్టుకుంది.
ఈ విషయం కాస్తా బయటకు పొక్కింది. భర్త నిలదీయటంతో నీళ్లు నమిలింది. తన తీరు మార్చుకోవాలని చెప్పినప్పటికీ మారని కల్పన భర్తను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇదే సమయంలో భార్య తీరును తీవ్రంగా తప్పు పట్టిన భర్తపై కత్తితో దాడి చేసి చంపేసింది. అనంతరం ఈ విషయాన్ని తన నలుగురు ప్రియులకు చెప్పింది. ఇంటికి వచ్చిన వారు బసురాజ్ బసు మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసి.. కారులో ఊరు బయట పడేశారు. గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేసి.. ఎవరి దారిన వారు ఉండిపోయారు.
అయితే.. కల్పన ఇంటి పక్కన వ్యక్తికి అనుమానం రావటం.. తన అనుమానాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లటంతో వారు అలెర్ట్ అయ్యారు. తీగ లాగితే డొంక కదిలిన వైనంగా కల్పన.. ఆమె నలుగురు ప్రియుళ్లు చేసిన దారుణం బయటకు వచ్చి అవాక్కు అయ్యేలా చేసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి ఉదంతాలు మానవ సంబంధాలపై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు.