చంద్రబాబు ఏం ప్లాన్ చేసినా అది వర్క్‌వుట్ కావటం లేదా? బాబు ఏదో చేయాలని అనుకుంటే అది కాస్తా ఏదోలా అవుతుందా? అంటే అవుననే చెబుతున్నారు. తాజాగా పరిణామాలే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.
తమ సర్కారుకు చెందిన ప్రముఖుల ఫోన్లను తెలంగాణ రాష్ట్ర సర్కారు ట్యాప్ చేసిందని గగ్గోలు పెట్టిన బాబు అండ్ కో ఇప్పుడు అదే వివాదంలో చిక్కుకోవటం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్ యంత్రాల కోసం ఏపీ సర్కారు ఐటీ సంస్థతో బేరసారాలు ఆడుతుందన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యాభై ఫోన్ల వరకూ ట్యాపింగ్ చేసేందుకు వీలుగా.. అందుకు అవసరమైన సాంకేతికతను సొంతం చేసుకోవటానికి ఒక ఐటీ కంపెనీతో ఏపీ సర్కారు బేరాలు ఆడుతున్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావటం గమనార్హం.
ఉత్త ఆరోపణ మాదిరి కాకుండా.. అందుకు సంబంధించిన వివరాల్ని కూడా బయటపెట్టటం విశేషం. ఈ అంశం బయటకు రావటానికి వికీలీక్స్ కారణం అంటూ.. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఉటంకిస్తున్నారు.
ఓటుకు నోటు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతే.. ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కోసం ప్రయత్నాలు షురూ అయినట్లు చెబుతున్నారు. దాదాపు రూ.7.5కోట్ల ఖర్చుతో ఇలాంటి టెక్నాలజీని సొంతం చేసుకోవటానికి హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో బేరసారాలు ఆడినట్లు పేర్కొనటంతో పాటు.. అందుకు సంబంధించిన ఈమొయిళ్లను బయట పెట్టటం విశేషం.
ట్యాపింగ్ యంత్రాల కొనుగోలుకు ఏపీ సర్కారు ప్రయత్నిస్తోందంటూ.. వికీలీక్స్ కొన్ని కేబుళ్లను బయటపెట్టింది. దీంతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన పత్రిక నమస్తే తెలంగాణ హడావుడి చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఇంతకాలం గగ్గోలు పెట్టిన బాబు సర్కారు.. ఇప్పుడు ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసింది తెలంగాణ సర్కారు దెబ్బ తీయటానికే అంటూ వాదనను వినిపిస్తోంది. మరి.. ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.