అవును... ఇప్పుడు టీడీపీ నేతల మధ్య ఒక కీలక విషయం చర్చకు వచ్చింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు.. చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తమ్ముళ్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ``అచ్చెన్న చెప్పింది నిజమవుతుందా?!`` అని నెటిజన్లు కూడా ఆసక్తిగా ప్రశ్నిస్తు న్నారు. రాష్ట్రంలో వ్యూహాత్మక రాజకీయాలు సాగుతున్నాయి. అధికార పార్టీపై పైచేయి సాధిం చేందుకు ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెట్టేందుకు.. అధికార పార్టీ ప్రయత్నిస్తోంది.
అయితే.. ఈ మధ్యలో రాజకీయ వ్యూహాలు.. మాటల మంటలు షరా మామూలే అన్నట్టుగా సాగుతున్నా యి. తాజాగా.. అచ్చెన్నాయుడు మాట్టాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని.. చెప్పారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో.. 155 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కడం తథ్యమని జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి.. ఉద్యమంలో అచ్చెన్న చేసిన.. ఈ వ్యాఖ్యలు.. టీడీపీలో జోష్ నింపుతుందని అనుకున్నారు. వాస్తవానికి.. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీలో యువత సహా సీనియర్లలో ఉత్సాహం నింపడం తోపాటు వారంతా కలిసి పనిచేసేందుకు దోహదం అవుతుంది.
అయితే.. ఇప్పుడు అచ్చన్న చేసిన వ్యాఖ్యలు.. మరీ ముఖ్యంగా 155 స్థానాలను దక్కించుకుని .. చంద్రబా బు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం.. ఆశ్చర్యంతో పాటు.. విస్మయానికి కూడా గురి చేస్తుండడం గమనార్హం. ఎందుకంటే వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. 2014లో చంద్రబాబు హవా జోరుగా ఉన్న సమయంలోనే.. ఇన్ని స్థానాల్లో పార్టీ విజయం దక్కించుకున్న పరిస్థితి కనిపించలేదు. మరి ఇప్పుడు.. అన్ని స్థానాలు గెలవడం అంటే.. అచ్చెన్న చెప్పింది సాధ్యమేనా ? అనేది తమ్ముళ్ల అంతర్గత గుసగుస..!
పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న అచ్చెన్న బాధ్యతగా వ్యవహరించకుండా.. ఇలా క్యాడర్‌ను ఊహల్లో, మబ్బుల్లోకి దింపే కబుర్లు చెబుతున్నారేంటి ? అన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఆశ ఉండొచ్చు.. కానీ.. వాస్తవానికి దూరంగా.. వ్యాఖ్యానించడం వల్ల.. అచ్చెన్న ఉద్దేశం, వ్యూహం రెండు మైనస్ అయ్యేలా ఉంది. ఇంకా 20 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో అచ్చెన్న టార్గెట్ కొండకు నిచ్చెన వేయడం లాగానే ఉంది.