స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది. కమీషన్ లోని జాయింట్ డైరెక్టర్ శెలవుపై వెళ్ళారని ఏకంగా ఆయన్ను ఉద్యోగంలో నుండి డిస్మిస్ చేసేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే కమీషన్ లోని జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ అనారోగ్య కారణంతో నెలరోజులు శెలవుపెట్టారు. దీన్ని నిమ్మగడ్డ చాలా తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అందరినీ హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఆదేశించారు.
అయితే తన ఆదేశాలకు విరుద్ధంగా సాయిప్రసాద్ వ్యవహరించారనే కారణంతో ఆయన్ను ఏకంగా ఉద్యోగంలో నుండి తీసేశారు. అనారోగ్యంతో శెలవుపెడితే ఉద్యోగంలో నుండి తీసేయటం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. పైగా ఆయనకు ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏదీ ఇచ్చేందుకు వీల్లేదని తన ఉత్తర్వుల్లో చెప్పటం మరింత విచిత్రంగా ఉంది.
అనారోగ్యంతో శెలవు పెట్టడం తప్పేమీకాదు. ఎన్నికల ప్రక్రియ మొదలవ్వటానికి అనారోగ్యానికి సంబంధమే లేదు. అనారోగ్యమన్నది ఎప్పుడైనా రావచ్చు. ఇంతచిన్న విషయాన్ని కూడా నిమ్మగడ్డ బూతద్దంలో చూసి ఏకంగా ఉద్యోగంలో నుండే తీసేయటం కమీషన్లో సంచలనంగా మారింది. పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా ఆపేయాలని ఆదేశించటమే ఆశ్చర్యంగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపేయటం ఎవరి వల్లా కాదు. ఈ విషయం నిమ్మగడ్డకు తెలీకుండా ఉంటుందనుకునేందుకు లేదు. అయినా ఉత్తర్వులిచ్చారంటే సాయిప్రసాద్ మీద కమీషనర్ కు ఎంత పగుందో అర్ధమైపోతోంది.
అనారోగ్యంపై ఎవరైనా శెలవుపెడితే వాళ్ళ స్ధానంలో మరొకరిని నియమించుకుని బాధ్యతలు అప్పగించటం సాధారణంగా అన్నీచోట్లా జరిగేదే. పైగా సాయిప్రసాద్ తో పాటు మరో ఇద్దరు శెలవుపెట్టినా క్రమశిక్షణ చర్యలు మాత్రం జాయింట్ డైరెక్టర్ మీద మాత్రమే తీసుకోవటం మరింత విచిత్రంగా ఉంది. సరే జాయింట్ డైరెక్టర్ ఈ విషయంలో ఎలాగూ కోర్టును ఆశ్రయిస్తారనుకోండి అది వేరే సంగతి.