డోనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. చైనా.. భారత్ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. వివాదాస్పద వ్యాఖ్యలతో వేడి పుట్టించే అమెరికా అధ్యక్షపదవి రేసులో నిలిచేందుకు విపరీతంగా శ్రమిస్తున్న రిపబ్లికన్ల నేత డొనాల్డ్ ట్రంప్ మంట పుట్టించే వ్యాఖ్య ఒకటి చేశారు. అమెరికన్ల నుంచి చైనీయులు.. భారతీయులు ఉద్యోగాలు లాక్కెళుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
అలా వెళ్లిన ఉద్యోగాల్ని అమెరికన్ల కోసం వెనక్కి తీసుకొస్తానంటూ శపధం చేయటమే కాదు..ఈ విషయంలో తనకు ఆఫ్రికన్ అమెరికన్ల నుంచి మద్దుతు కోరుతున్నట్లుగా వెల్లడించారు. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ట్రంప్.. 58 శాతం ఆఫ్రికన్ అమెరికన్ యువత నిరుద్యోగులేనని వెల్లడించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు.. చైనీయులు.. భారతీయుల ప్రయోజనాల్ని దెబ్బ తీయటం పక్కా అన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. నిత్యం ఏదో ఒక హాట్ వ్యాఖ్య చేసే ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలపై అమెరికన్లు.. ఆఫ్రికన్ అమెరికన్ల నుంచి ఎలాంటి స్పందన వెలువడుతుందో చూడాలి.