లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన సంపూర్ణ మెజారిటీ, దేశ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ల్యాండ్ స్లైడ్ విక్టరీ, బీజేపీ ధాటికి కాంగ్రెస్ చిత్తు అయిపోవడం.. వంటి పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాహుల్ గాంధీ ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాడు. రాజీనామా అంటున్నారాయన. పార్టీ నేతలు వద్దని వారిస్తున్నా రాహుల్ మాత్రం రాజీనామాకు కట్టుబడి ఉండేలా ఉన్నారు!
అదే అనుకుంటే..కాంగ్రెస్ పార్టీకి ఇంకా రకరకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు పరిమితమైన రేంజ్ లో ఉన్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కొద్దో గొప్పో కోలుకుంది.
రాజస్తాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గడ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కర్ణాటకలో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. ఇలా కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాలు తక్కువే. అయితే వీటిల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని చూసి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అటుగా జంప్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. దీంతో రాజస్తాన్, మధ్య ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు కుప్పకూలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజాస్తాన్ లో కచ్చితమైన మెజారిటీ ఉంది. మధ్య ప్రదేశ్ లో బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. కర్ణాటకలో సంకీర్ణం అయినా ఉన్న మెజారిటీ స్పల్పమే. ఈ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కాపాడుకోవడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.
కర్ణాటకలో అవకాశం కోసం బీజేపీ ఎదురుచూస్తూ ఉంది. ఎంపీ సీట్లను ఆ పార్టీ స్వీప్ చేయడంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడం ఖరారు అయ్యింది. దీంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కుమారస్వామి, కాంగ్రెస్ వాళ్లు జాయింటుగా కష్టపడుతూ ఉన్నారు. అయినా అక్కడ ప్రభుత్వం నిలబడుతుందా అనేది సందేహంగానే ఉంది.
ఇక మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ దక్కలేదు. ఒకటీ, రెండు సీట్లు సాధించిన ఎస్పీ, బీఎస్పీల మద్దతుతో, నలుగురు ఇండిపెండెట్లతో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు నిలబడింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే.. బీజేపీ వాళ్లు అక్కడ పావులు కదపడం మొదలుపెట్టారు. బీజేపీ వాళ్లు గట్టిగా తుమ్మితేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ పడిపోయే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే అవసరమైన మెజారిటీని పొందింది. అయితే లోక్ సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ లో చీలిక వస్తోందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ఏకంగా ఇరవై ఐదు ఎంపీ సీట్లనూ నెగ్గడంతో కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది.
దాదాపు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారట. వారు అటు వైపు వెళితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం అయిపోతే గ్యారెంటీ అని పరిశీలకులు అంటున్నారు!