మధ్య ప్రదేశ్ పై కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో అంటే!

Update: 2019-05-02 01:30 GMT
మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరీ ఘన విజయం కాకపోయినా ఒక మోస్తరు విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ  పదిహేనేళ్ల పాటు అధికారాన్ని కలిగి ఉండటంతో కాంగ్రెస్ విజయం అక్కడ ఈజీ అయ్యింది. బీజేపీని అధికారంలో నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది.

ఇదంతా జరిగి కేవలం కొన్ని  నెలలు మాత్రమే  అవుతోంది. ఇంతలోనే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్ కూడా ఒకటిగా నిలుస్తూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లా ఇక్కడ పట్టు వదిలేది ఉండదని అంటోంది. తామే మెజారిటీ  ఎంపీ సీట్లను నెగ్గుతామంటూ కమలం పార్టీ కూడా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తూ ఉంది.

తాజాగా మధ్యప్రదేశ్ విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాట్లాడుతూ.. తమ పార్టీ విజయం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాదు ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లున్న తమ రాష్ట్రంలో తమ పార్టీ ఇరవై రెండు ఎంపీ సీట్లను నెగ్గుతుందని కమల్ నాథ్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. మరి అసలు కథ ఎలా ఉంటుందో మే ఇరవై మూడున తేలాల్సిందే!
Tags:    

Similar News