2022 లో అనేక వైఫల్యాలు ఎదుర్కొన్న టీమిండియా కొత్త సంవత్సరంలో మంచి ఫలితాలు ఉంటాయని ఆశించింది. న్యూ ఇయర్ ఉత్సాహంతో 2020 ఫార్మట్ ద్వారా శ్రీలంకతో బరిలోకి దిగింది. అయితే మొదటి మ్యాచ్ గెలిచిన భారత్ రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఈ ఓటమికి జట్టు వైఫల్యాలే కారణమని తెలుస్తోంది. కొందరు ఆటగాళ్లు కష్టపడి స్కోరును అందించిన నోబాల్స్ అధికంగా వేయడం వల్ల గురువారం నాటి మ్యాచ్ కోల్పోయిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా టీమిండియా జట్టు బాగుపడుతుందా..? అని అనుకుంటున్నారు. కెప్టెన్సీ మార్పుతో చక్కబడుతుందని అనుకున్న సెలెక్టర్లు ఇప్పుడు హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయని భావిస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో టీమిండియా పలు అపజయాలను చవి చూసింది. ముఖ్యంగా 2019 ప్రపంచ కప్ లో పేవలమైన ప్రదర్శన చేసి విమర్శల మూట గట్టుకుంది. ఆ తరువాత విరాట్ పై విమర్శలు మొదలయ్యాయి. సౌతాఫ్రియా సిరీస్ లోనూ విరాట్ కెప్టెన్సీ బాగా లేదని అన్నారు. దీంతో ఆయన 2020 ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత వన్డే లకు కూడా కెప్టెన్ గా ఉండడని తెలిపారు. దీంతో రోహిత్ శర్మకు ఆ బాధ్యతలను అప్పగించారు. రోహిత్ సారథ్యంలోనూ ఆసియాకప్, టీ20 కప్ లో టీమిండియా ఓడిపోయింది. వరుస గాయాలతో పాటు కీలక మ్యాచ్ లు ఓడిపోవడానికి రోహిత్ శర్మనే కారణమని అన్నారు. దీంతో యంగ్ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు తాజాగా టీమిండియా కెప్టెన్సీ చేసే అవకాశం ఇచ్చారు.
హార్దిక్ పాండ్యా ఆధ్వర్యంలో జట్టు శ్రీలంకతో బరిలోకి దిగింది. మొదటి మ్యాచ్ గెలవగానే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీతోనేనని అనుకున్నారు. కానీ గురువారం నాటి మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. కానీ నోబాల్స్ అధికాంగా వేసి ఓడించారని అంటున్నారు. నో బాల్స్ ద్వారా శ్రీలంకకు అదనంగా 36 పరుగులు వచ్చాయి. అర్ష్ దీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ వేయడం గమనార్హం. 207 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కాసున్ రజితా వేసిన రెండో ఓవర్లోనే ఇసాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుబ్ మన్ గిల్ క్యాచ్ అవుటయ్యాడు. ముదుషంక వేసిన ఆ మరుసటి ఓవర్ లో ఆరంగేట్ర ప్లేయ్ రాహుల్ త్రిపాటి కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీడ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సిక్స్, ఫోర్ తో జోరు కనబర్చినా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. కరుణరత్నే వేసిన ఐదో ఓవర్ లో కీపర్ క్యాచ్ గా పెవిలియన్ బాట పట్టాడు. దంతో టీమిండియా 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
అయితే అక్షర్ పటేల్ వరుసగా మూడు సిక్స్ లు, సూర్య మరో సిక్స్ కొట్టడంతో 26 పరుగులు వచ్చాయి. ఈ ఇద్దరు జోరు కనిపించినా మిగతా ప్లేయర్ల పేవల ప్రదర్శనతో భారత్ ఓటమిని చవి చూసింది. అయితే హార్దిక్ పాండ్యా బ్యాట్స్ మన్ క్రమాన్ని సరైన విధంగా సర్దుబాటు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 5 నోబాల్స్ వేసేదాకా అర్స్ దీప్ సింగ్ కు అవకాశం ఇవ్వడం మైనస్ అని తెలుస్తోంది. దీంతో ముందు ముందు జరిగే మ్యాచుల్లో హార్దిక్ పాండ్యా సరైన నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు.
కెప్టెన్ లు మారినా.. టీమిండియా తలరాత మారడం లేదని.. ఆటగాళ్ల మైండ్ సెట్ మారనిదే ఎందరు హార్ధిక్ పాండ్యాలు వచ్చినా గెలిపించలేరని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.