జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి ప్రత్యేక వాహనం రోడ్డు మీదకు రాబోతోంది. ఇక తెలుగుదేశం భావి నాయకుడు నారా లోకేష్ యువ గళం పేరిట ఈ నెల 27 నుంచి కుప్పం తో తొలి అడుగులు వేయనున్నారు. ఇది సుదీర్ఘమైన పాదయాత్ర. ఏకంగా 400 రోజుల పాటు, నాలుగు వేల కిలోమీటర్ల దూరంతో సాగే ఈ పాదయాత్రకు ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఈ మేరకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య డీజీపీకి ఇప్పటికి రెండు సార్లు లేఖ రాసినా నో రెస్పాన్స్ అంటున్నారు.
అయినా సరే ఆరు నూరు అయినా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ధూం ధాం గా సాగి తీరుతుంది అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఏ రకమైన చర్యలకు దిగినా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరో వైపు చూస్తే జీవో నంబర్ 1 అన్న దాని మీద ప్రస్తుతం హై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ నెల 23 వరకూ మాత్రమే ఈ జీవోను హై కోర్టు సస్పెండ్ చేసింది.
దాంతో హై కోర్టు ఏమి చెబుతుంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది. హై కోర్టు ఈ విషయంలో కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే యాత్రలకు పచ్చ జెండా ఊపేసినట్లే. అలా కాకుండా జీవో మీద ఏమైనా సానుకూలంగా వ్యవహరిస్తే జీవో ప్రకారం రోడ్ల మీద సభలు కానీ రోడ్డు షోలు కానీ జరిపేందుకు వీలు ఉండదు.
దాంతో ఇపుడు ప్రభుత్వం కూడా హై కోర్టు వైపే చూస్తోంది. నిజానికి హై కోర్టు సస్పెన్షన్ లో పెట్టిన జీవో విషయంలో సుప్రీం కోర్టు దాకా ప్రభుత్వం వెళ్ళింది అంటేనే జీవో నంబర్ 1 మీద ఎంత పట్టుదలగా ఉందో అర్ధమవుతోంది. అయితే హై కోర్టుకే ఈ విషయం సుప్రీం కోర్టు వదిలేసినందువల్ల అక్కడ తీర్పు కోసం వేచి ఉండక తప్పదు.
ఇక పవన్ కళ్యాణ్ వారాహి రధంతో ఏపీలో టూర్లు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ వాహనానికి తెలంగాణాలో రిజిస్ట్రేషన్ చేశారు. ఏపీలో రోడ్ల మీద ఈ ప్రత్యేక వాహనం తిరగాలీ అంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో పవన్ కూడా తాడో పేడో అన్నట్లుగా వారాహిని రోడ్ల మీదకు తీసుకువస్తారు అని అంటున్నారు.
ఆయన అమీ తుమీకి సిద్ధం అయితే ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే కొత్త ఏడాది మొదలవుతూనే యాత్రా స్పెషల్ మొదలవుతోంది. ప్రభుత్వం అయితే జీవో నంబర్ 1 పేరిట అనుమతులు ఇచ్చే సీన్ లేదు అంటోంది. దీంతో కోర్టుకు వెళ్ళి అనుమతులు తీసుకుంటారా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. ఏది ఏమైనా ఏపీ సర్కార్ జీవో నంబర్ 1 అనే ఆయుధంతో ముందుకు సాగాలని అనుకుంటూంటే యాత్రలను ఆపే హక్కు ఎవరికీ లేదు అన్నట్లుగా ప్రతిపక్షాలు దూకుడు చేయడానికి రెడీ అవుతున్నాయి. దాంతో ఏపీలో పాలిటిక్స్ హీటెక్కిపోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.