డిప్యూటీ సీఎం.. టీఆర్ ఎస్ లో సీనియర్ నేత అయిన కడియం శ్రీహరి టీఆర్ ఎస్ పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన కార్యకర్తల ద్వారా సమాచారం లీక్ అవుతోంది. టీఆర్ ఎస్ లో తనపై తీవ్రమైన వివక్ష చూపుతున్నారని.. కేసీఆర్ తనకు టికెట్ , పదవులు కూడా రెండో దఫా ప్రభుత్వంలో ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఉన్న కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ తొలి ప్రభుత్వంలో లక్కీగా కడియం శ్రీహరి ఎస్సీ కోటాలో ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బలమైన నాయకుడిగా పేరు పొందారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ - కడియం కలిసి పనిచేశారు. అయితే అంత సాన్నిహిత్యం ఉన్నా కూడా మొన్నటి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కడియంను పూర్తిగా పక్కన పడేశారు కేసీఆర్. కడియం కోరిన స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ టికెట్ ను ఇవ్వలేదు. పైగా లైంగిక - తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న రాజయ్యకే టికెట్ ఇవ్వడం కడియం వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక కడియం కూతురు కావ్యకు వరంగల్ లోక్ సభ సీటు ఇవ్వాలని కోరిన కేసీఆర్ పట్టించుకోలేదట..
దీంతో అప్పటి నుంచి ముభావంగా ఉంటూ పార్టీ వ్యవహారాలు - కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కడియం శ్రీహరి. తాజాగా తన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని అనుచరులతో రహస్యంగా భేటి అయినట్టు విశ్వసనీయ సమాచారం.సర్పంచ్ - పరిషత్ ఎన్నికల్లోనూ కడియం అనుచరులకు టీఆర్ ఎస్ టికెట్లు ఇవ్వలేదని వారంతా ఫిర్యాదు చేశారట.. దీంతో టీఆర్ ఎస్ లో భవిష్యత్ లేదని.. తమను పట్టించుకోవడం లేదని భావించి శ్రీహరి తాజాగా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా మాత్రం కడియం కానీ.. టీఆర్ ఎస్ శ్రేణులు కానీ స్పందించలేదు.