“బీజేపీలో ఏకవ్యక్తి పాలన ఉండదు...ప్రజస్వామ్యం తప్ప వ్యక్తి స్వామ్యం ఉండదు”అంటూ ఆ పార్టీ నేతలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. తమది కాంగ్రెస్ లా ఒకేవ్యక్తి మీద ఆధారపడి నడిచే పార్టీ కాదని కూడా అంటుంటారు. అయితే అవన్నీ ఒట్టిదే అని ఒక ఫోటో తెలుపుతుంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇక ఫోటో చూసిన నెటిజన్లు బీజేపీలో కూడా ఇలా ఉంటుందా ? అని కామెంట్లు చేస్తున్నారు.
అసలు అందరినీ అంతలా ఆశ్చర్యపోయేలా చేసిన ఫోటో ఎవరిది అంటే ? కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కలిసి ఉన్నది. అయితే ఇద్దరు ఫోటోలో ఉంటే తప్పేంటి అనుకుంటున్నారు. అయితే అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఆ ఫోటోలో రామ్ మాధవ్ సోఫా లాంటి పెద్ద చైర్ లో కూర్చుని ఉండగా, కిషన్ రెడ్డి ఒక చిన్న చెక్క కుర్చీలో చాలి చాలనట్లుగా కూర్చున్నారు. అది కూడా చేతులు కట్టుకుని అతి వినయంతో కిషన్ ఉన్నట్టు ఉన్నారు.
రామ్ మాధవ్ కిషన్ రెడ్డి కంటే పెద్ద తోపు లీడర్ ఏం కాదు. కనీసం ఆయన వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేదు. కానీ కిషన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తాజా ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. పోనీ కిషన్ రెడ్డికి కాకపోయిన ఆయన పదవికి అయినా రామ్ మాధవ్ విలువ ఇవ్వాల్సింది. అటు కిషన్ రెడ్డి కూడా ఇలా కూర్చుని తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకున్నట్లుగా అనిపిస్తోంది.
ఇక ఫోటో చూస్తుంటే బీజేపీలో కూడా వ్యక్తిస్వామ్యం ఉందని అర్ధమవుతుంది. అసలు వ్యక్తిస్వామ్య వ్యవస్థ కాంగ్రెస్ లోనే ఉంటుంది తప్ప..మా దగ్గర ఉండదు అనే చెప్పే బీజేపీ నేతలు ఇప్పుడు ఏం చెబుతారో చూడాలి. మొత్తానికి ఈ ఫోటో మీద అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కొందరైతే కిషన్‌కు రామ్ మాధవ్ అంటే భయమా ? భక్తా ? అని సెటైర్లు వేస్తున్నారు. మరి దీని మీద కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.