ముగియనున్న లాక్ డౌన్: ఇవిలేకుండా వస్తే కేసులే

Update: 2020-04-29 11:31 GMT
రెండో దశ లాక్ డౌన్ ముగింపుదశకు వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో మే 3న దేశవ్యాప్తంగా ముగియబోతోంది. నెలన్నర రోజులుగా దేశవ్యాప్తంగా కొనసాగిన లాక్డౌన్ విజయవంతంగా సాగింది.అన్ని రాష్ట్రాలు స్టిక్ట్ గా అమలు చేశాయి. అయితే కరోనా తీవ్రత ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వేగంగా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగిస్తారా? లేక హాట్ స్పాట్ ప్రాంతాలకే పరిమితం చేస్తారా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ సాగుతోంది.

ఇటీవలే అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ ను పొడిగించడానికే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అయితే తన వైఖరి ఏంటన్నది మాత్రం ప్రధాని వెల్లడించలేదు.

అయితే కేంద్రం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ ను పాక్షికంగా సడలిస్తారని తెలుస్తోంది. అయితే కొన్ని కఠిన చర్యలు అమలు చేయాలని చూస్తున్నారట.. సడలింపుల తర్వాత ముఖానికి మాస్కులు లేకుండా.. ఫేస్ కవర్లను ధరించకుండా రోడ్ల మీదకు వస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

మాస్కులు జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య మంత్రులతో సమావేశంలో సూచించారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇక కరోనాను నియంత్రించలేమని.. మన జీవితంలో భాగమైందని.. స్వీయ నియంత్రణే మేలని.. లాక్ డౌన్ ఎత్తేశాక కూడా కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ తాజాగా ప్రధానికి సూచించారు.

దీన్ని బట్టి లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడానికి కేంద్రం రెడీ అవుతోంది. అయితే మాస్కులు సహా జాగ్రత్తలు పాటించేలా నిబంధనలు రూపొందిస్తారని తెలుస్తోంది. సోషల్ డిస్టేన్స్ ను తప్పనిసరి చేయబోతోందట.. ఇవి పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతోందట.. ఇలా లాక్ డౌన్ ఎత్తివేయడంతోపాటు కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


Tags:    

Similar News