కనీసం స్థానిక ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకూ అయినా జనసేన అధిపతిగా పవన్ కల్యాణ్ పని చేయాల్సిందని అంటున్నారు పరిశీలకులు. పవన్ కల్యాణ్ అలా సినిమాల్లోకి వెళ్లిపోవడం, మొహానికి రంగు వేసుకోవడం.. ఇటు వైపు స్థానికలు వచ్చేయడం జరిగింది. ఇది జనసేనకు మరో శరాఘాతంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు సినిమా మూడ్ లేకి వెళ్లిపోయారు. సినిమాకు సంబంధించి హైప్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు జనసైనికులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరాభిమానులు అంతా తమ వంతుగా పని చేసినా.. పవన్ కల్యాణ్ , ఆయన పార్టీ ఎలాంటి ఫలితాలను పొందిందో అందరికీ తెలిసిందే!
అయితే ఇప్పుడు పవన్ అభిమానులు సినిమా మూడ్ లోకి వెళ్లిపోయారు. ఒకటి కాదు.. రెండు మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మళ్లీ రాజకీయాల వైపు టర్న్ కావడానికి అవకాశం లేకుండా పోతోంది. పవన్ కల్యాణ్ కూడా సినిమా షూటింగులకు విరామం తీసుకునే స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేయవచ్చు! అది కూడా ఏ మేరకు ప్రచారమో తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఇప్పుడు జగన్ సర్కారును పవన్ కల్యాణ్ ఏదైనా విమర్శించినా.. ఏ మాత్రం లేటు లేకుండా సెటైర్లు పడతాయి. సినిమాలు చేసుకునే పవన్ కల్యాన్ వచ్చి రాజకీయం గురించి మాట్లాడేది ఏమిటని ప్రత్యర్థులు విమర్శలు సందించవచ్చు! వాస్తవానికి పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం తో ఆయన పొలిటికల్ గ్రాఫ్ మరింత పతనం అయ్యింది.
పూర్తి స్థాయిలో.. పవన్ కల్యాణ్ ప్రచారం చేసి, పార్టీ కోసం పని చేసినప్పుడే ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇప్పడేమో ఒకవైపు పవన్ కల్యాణ్ సినిమా అప్ డేట్స్ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పవన్ పార్టీని జనాలు మరింత లైట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పవన్ పార్టీ నామినేషన్ల పర్వంలో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. స్థానిక ఎన్నిల ఫలితాలు పవన్ రెండు పడవల ప్రయాణాన్ని ప్రజలు ఎంత వరకూ ఆమోదిస్తారనే అంశంపై మరింత స్పష్టత రావొచ్చు.