రాహుల్ ని బకరా చేసిన సోనియా!

Update: 2020-03-26 11:15 GMT
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కరోనా అనే ఒకే ఒక మాట మాత్రమే వినిపిస్తుంది. చిన్నా లేదు పెద్దా లేదు.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ కరోనా పేరు వింటేనే వణికి పోతున్నారు.  ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లు ప్రపంచంలో తమ ప్రతాపాన్ని చూపించాయి.. కానీ ఈ కరోనా వైరస్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ఇప్పటి వరకు ఈ భయంకరమైన వైరస్ కి మందు కనుగొనలేదు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 650 దాటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం  కరోనా కేసుల సంఖ్య పెరిగింది.

ప్రస్తుతం కరోనాను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు దేశ వ్యాప్తంగా మార్చ్ 24 నుంచి లాక్ డౌన్ చేశారు. ప్రజలు ఎవరి ఇంట్లో వారే ఉంటూ తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు.  కొంతవరకు కంట్రోల్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇకపోతే ఇలాంటి విపత్కర సమస్యలు ఎదురైనప్పుడు  కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు సమర్ధించాలి. అధికార - విపక్షం మధ్య  ఎప్పుడు విమర్శలు చేస్తుంటారు. కానీ , ఇలాంటి సమయంలో అందరూ కలిసి పనిచేయాలి. తాజాగా సోనియా గాంధీ అదే చేసింది.  ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది.  లాక్ డౌన్ నిర్ణయం మంచిదే అని చెప్పి కొన్ని సూచనలు చేస్తూ లేఖ రాసింది.  అయితే,  రాహుల్ గాంధీ మాత్రం కేంద్రం లాక్ డౌన్ చేసే ముందు కార్మికుల గురించి రోజువారీ వేతనం పొందే వారు ఇబ్బందులకు గురి అవుతున్నారని , వారి వారి పరిస్థితి దారుణంగా ఉందని విమర్శలు చేసారు. దీనితో రాహుల్ ఇంకా రాజకీయంగా పరిణితి చెందాల్సిన అవసరం ఉందంటూ కొందరు నేతలు ...కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News