కొత్త అజెండాతో టీడీపీ సక్సెస్ అవుతుందా ?

Update: 2021-09-11 04:18 GMT
అవును దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగున్నా ఏపిలో మాత్రం కమలనాదుల అజెండాను తెలుగుదేశంపార్టీ హైజాక్ చేసిందనే చెప్పాలి. మొదటి నుండి బీజేపీకి ప్రత్యేకంగా ఎన్నికల నినాదమంటు ఏమీలేదు. ఉన్నదల్లా జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే టార్గెట్. జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టాలంటే హిందుత్వానికి మించిన సబ్జెక్టు ఇంకోటేముంది ? అందుకనే బీజేపీ గుళ్లు, దేవుళ్ళు, హిందుమతం అంటు సమాజాన్ని నానా కంపు చేసేసింది. ఇపుడు కూడా అదే చేస్తోంది.

ఈ కంపు మిగిలిన రాష్ట్రాల్లో పార్టీకి లాభంగా ఉన్నా ఏపిలో మాత్రం సాధ్యం కావటంలేదు. ఎందుకంటే బీజేపీకన్నా బలమైన పార్టీ టీడీపీ కూడా ఇపుడు అదే అజెండాను తలకెత్తుకున్నది కాబట్టే. గతంలో ఎప్పుడు కూడా టీడీపీకి అలవాటు లేని అజెండా ఇది. రాష్ట్రంలోని ప్రతి పక్షాల్లో ఏది బలమైన పార్టీ అనే విషయంలో పోటీ జరుగుతోంది. నిజానికి టీడీపీనే బలమైన పార్టీ అనటంలో సందేహంలేదు. కానీ టీడీపీ ఎత్తిపోయిన పార్టీ అని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామేనంటు కమలనాదులు చేస్తున్న గోలకు టీడీపీ నుండి సరైన కౌంటర్ కనబడటంలేదు.

ఈ పరిస్దితుల్లోనే బీజేపీ అజెండా అయిన గుడులు, దేవుళ్ళకు అపచారం లాంటి ఆరోపణలు, విమర్శలతో టీడీపీ కూడా రెచ్చిపోతోంది. ఎప్పుడైతే హిందుత్వ అజెండాను టీడీపీ కూడా నెత్తికెత్తికుందో బీజేపీ నేతలు వెనకబడిపోయారు. ఎందుకంటే టీడీపీకి ఊరూరా నేతలు, కార్యకర్తలున్నారు. పటిష్టమైన పార్టీ యంత్రాంగముంది. పైగా అన్నింటికన్నా బలమైన మీడియా సపోర్టుంది. ఇవేవీ బీజేపీ నేతలకు లేదు.

ఇన్ని అడ్వాంటేజిలున్న కారణంగానే వినాయకచవితి పండగ సందర్భంగా బహిరంగ ఉత్సవాల విషయంలో చంద్రబాబునాయుడు దగ్గర నుండి క్రిందిస్ధాయి నేతలవరకు నానా గోలచేశారు. జగన్మోహన్ రెడ్డిపై హిందువ్యతిరేక ముద్రను పదే పదే వేస్తున్నారు. ఒకే తరహా ఆరోపణలు, విమర్శలు ఇటు బీజేపీ అటు టీడీపీ నేతలు చేస్తున్నా మీడియాలో ఎక్కువగా టీడీపీ నేతలకొచ్చినంత మైలేజీ కమలనాదులకు రాలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి మతపరమైన అజెండాను టీడీపీ తలకెత్తుకున్నది లేదు.

ఏ ఎన్నికల్లో  చూసినా సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురిచే మాట్లాడిన చంద్రబాబు అండ్ కో కొద్ది రోజులుగా మాత్రమే హిందుత్వ కార్డు మొదలుపెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మతపరమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అయితే ఇలాంటి రాజకీయాలకు జనాలు పెద్దగా స్పందిచరన్న విషయం టీడీపీ మరచిపోతోంది. ఎందుకంటే ఉత్తరాధిలో పరిస్ధితులు వేరు, ధక్షిణాది రాష్ట్రాల పరిస్ధితి వేరు. ఉత్తరాధిలో హిందుత్వ కార్డు సక్సెస్ అయితే ధక్షిణాదిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకే జనాలు జైకొట్టారు. మరి ఈ విషయం తెలిసీ బీజేపీ అజెండాను టీడీపీ హైజాక్ చేయటంలో ఉద్దేశ్యమేమిటో ?
Tags:    

Similar News