ఆయన యువ నాయకుడు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే..వచ్చే ఎన్నికల్లో మాత్రం అటు అసెంబ్లీకో.. ఇటు పార్లమెం టుకో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో అధిష్టానం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఎన్నికలు సమీ పిస్తున్న సమయంలో తనకు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయాలంటూ.. ఆయన సీఎం కరుణ కోసం వేచి చూస్తున్నారట. ఆయనే దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ చక్రవర్తి. 2019లో దుర్గా ప్రసాద్ తిరుపతి పార్లమెంటు నుంచి విజయం దక్కించుకున్నారు.
అయితే.. అనారోగ్య కారణంగా ఆయన చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కళ్యాణ చక్రవర్తి.. ఈ సీటును ఆశించా రు. అయితే.. బైపోల్‌లో మాత్రం జగన్ ఈ కుటుంబానికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి.. దీనిని డాక్టర్ గురుమూర్తికి ఇచ్చి గెలిపించారు. అయితే.. ఎమ్మెల్సీ అయినప్పటికీ.. కళ్యాణచక్రవర్తికి సంతృప్తిగా లేదనేది ఆయన కుటుంబం చెబుతున్న మాట. ఎందుకంటే.. దుర్గాప్రసాద్.. గతంలో టీడీపీలో ఉండగా.. భారీ అనుచరవర్గాన్ని సృష్టించుకున్నారు. ఇప్పుడు ఆ వర్గం.. కకావికలు అయిపోతే.. తమకు ఇబ్బందేనని ఈ కుటుంబం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో అనుచరులను కాపాడుకునేందుకు.. ప్రజలకు చేరువ అయ్యేందుకు అసెంబ్లీకికానీ, పార్లమెంటుకు కానీ.. పోటీ చేయాలని బల్లి కళ్యాణ చక్రవర్తి భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు ఆప్షన్లు చెబుతున్నారు.
ఒకటి తిరుపతి పార్లమెంటు స్థానం. అయితే.. ఇది మరోసారి గురుమూర్తికే దక్కనుంది. దీనిపై సీఎం జగన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో.. దీనిపై బల్లికి ఆశలు పోయాయి. ఇక, మిగిలింది.. గూడూరు. గతంలో అనేక సార్లు గూడూరు నుంచి బల్లి దుర్గాప్రసాద్ విజయందక్కించుకుని ఉండడంతో దీనిని తనకు కేటాయించాలని కళ్యాణ్ చక్రవర్తి కోరుతున్నారు.
గూడూరు నియోజకవర్గం అయితే.. గెలుపు గుర్రం ఎక్కడం ఈజీ అని కూడా ఆయన చెబుతున్నారు. ఆల్రెడీ.. తనకు, తన కుటుంబానికి కూడా బలంగా ఉన్న ఈనియోజకవర్గం అయినా తమకు ఇవ్వాలనేది కళ్యాణ చక్రవర్తి మాట. అయితే.. దీనిపైనా.. జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇక్కడ నుంచి మాజీ ఐఏఎస్ అదికారి వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన నిజాయితీపరుడే అయినప్పటికీ.. వివాదాలకు కేంద్రంగా మారారు. దీంతో ఇక్కడ నుంచి బల్లి వారసుడికి టికెట్ ఖాయం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.