మాములుగా అయితే ఆ పదవి ఆయనకి ఎప్పుడో దక్కాల్సింది. సొంత పార్టీలోనే వెన్నుపోటు పొడిచే వారే ఎక్కువగా ఉండటంతో పదవి దక్కడం కొంచెం ఆలస్యం అయింది అంతే తప్ప పదవి మాత్రం రాకుండా ఎక్కడికి పోలేదు. అందరూ ముందు నుండి ఊహించినట్టే తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠాన్ని రేవంత్ రెడ్డి కైవసం చేసుకున్నారు. టీడీపీలో అతి తక్కువ కాలంలోనే పార్టీలో అత్యంత కీలక నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే ఎన్నో వివాదాలు తెరపైకొస్తాయి. అందులో అతి ముఖ్యమైనది ఓటుకు నోటు కేసు. ఈ కేసు వ్యవహారం తోనే అప్పట్లో చంద్రబాబు హుటాహుటిన రాజధానిని హైదరాబాద్ నుండి అమరావతికి తరలించాడు. మాములుగా అయితే, ఇంకెవరైనా ఈ తరహా కేసులో ఇరుక్కుని వుంటే, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఎప్పుడో సరెండర్ అయ్యేవారే.
కానీ, అక్కడ ఉండేది వెన్నుచూపని రాజకీయ నేత రేవంత్ రెడ్డి కావడంతో గట్టిగా నిలబడ్డారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి పేరు పీసీసీ అధ్యక్ష పదవి కోసం గట్టిగా వినిపించింది. అయితే, కొందరు ఆ పదవి రాకుండా అడ్డుపడ్డారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. పార్టీ కోసం తాను చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. అదే ఈ రోజు ఆయనకి ఆ పదవి దక్కేలా చేసింది. అయితే , ఆయనకి ఆ పదవి దక్కడం తో కొందరు సీనియర్లు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మరికొందరు బయటకి చెప్పలేక సన్నిహితులకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఇప్పటిదాకా ఓ యెత్తు.. ఇకపై ఇంకో యెత్తు.. అంటున్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమనీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ, అదంత తేలిక కాదు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొనడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అలాగే , రాష్ట్రంలో బీజేపీ – టీఆర్ఎస్ మధ్య ఏదో తెలియని ఈక్వేషన్ నడుస్తోంది. ఆ ఈక్వేషన్ దెబ్బకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతూ వస్తోంది. ఒకేసారి తెలంగాణ రాష్ట్ర సమితితోనూ, బీజేపీతోనూ కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సి వుంటుంది. అయితే, తన మీద ఓటుకు నోటు కేసు వున్న దరిమిలా.. ఇటు తెలంగాణ ప్రభుత్వానికీ భయపడాలి, అటు కేంద్ర ప్రభుత్వానికీ తలొగ్గాలన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వున్నారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. కానీ, ఇప్పటిదాకా ఆయన అలా భయపడింది లేదు కనుక ఇకపైనా ఆయన అదే పోరాటం చేస్తారా, అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో టిఆర్ ఎస్ కి, అలాగే బీజేపీ కి ఎదురొడ్డి నిలిచి కాంగ్రెస్ ను పైకి తీసుకురావడం అంత సులువు ఏమి కాదు. కానీ, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంటే .. ఆయనకి అన్ని కలిసొస్తే కాంగ్రెస్ దశ మారుతుందేమో చూడాలి.