గెల‌వ‌క‌పోయినా ఫ‌ర్లేదు.. మెజారిటీ త‌గ్గిస్తారా.. టీడీపీలో ఇదే హాట్ టాపిక్‌...!

Update: 2022-11-16 03:58 GMT
టీడీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే వైసీపీ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, సంక్షేమం వంటి వాటికి మ‌హిళ‌లు ఫిదా అయిపోతున్నారు.

సో..వీరిని  త‌మ వైపు తిప్పుకోవ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇత‌ర పార్టీల‌కు క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో వైసీపీ విజ‌యాన్ని ఆప‌లేని ప‌రిస్థితి వ‌చ్చిన రావొచ్చ‌నేది.. పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే, మ‌రి ఏం చేయాలి?  ఎలా ముందుకు సాగాలి? అనేది కూడా ఆస‌క్తిక‌రం.

ఇదే విష‌యంపై కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్న ఆఫ్ దిరికార్డు మాటేంటంటే.. "పార్టీ గెలుస్తుందా?  లేదా.? అనేది ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తారు. అయితే మావంతుగా మేం కృష్ట‌ప‌డుతున్నాం. కృషి చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుని ముందుకు సాగుతున్నాం.

ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఏదైనా తేడా వ‌స్తుంద‌ని అంటే మాత్రం ఖ‌చ్చితంగా మేం చేయాల్సింది మేం చేస్తాం." అని కొంద‌రు నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతార‌నేది మాత్రం చెప్ప‌డం లేదు.

ఇక‌, రాజ‌కీయంగా చూస్తే.. వైసీపి మెజారిటీని సాధ్య‌మైన త‌గ్గించైనా.. ఆ పార్టీపై పైచేయి సాధిస్తామ‌ని చెబుతున్న నాయ‌కులు కూడా క‌నిపిస్తున్నారు. "వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని అనుకున్నా.. 2019లో వ‌చ్చిన‌న్ని సీట్లు మాత్రం రావు. ఏం చేయాలో మాకు తెలుసు. పైగా ప్ర‌జ‌లు కూడా కొంత మంది నాయ‌కుల వ‌ల్ల విసిగిపోయి ఉన్నారు. సో.. ప్ర‌జ‌లే ఆయా నేత‌లను ఓడిస్తారు. మేం జోక్యం చేసుకునే క‌న్నా.. ప్ర‌జ‌లే వారిని గ‌ద్దె దింపు తారు" అని మ‌రికొంద‌రు చెబుతున్నారు.

అంటే మొత్తంగా చూస్తే.. వైసీపీ నేత‌ల‌ను ఢీకొట్టేలా వ్యూహాత్మ‌కంగా అయితే టీడీపీ పావులు క‌దుపుతుంది. కానీ, ఎక్క‌డైనా తేడా కొడితే మాత్రం ఖ‌చ్చితంగా వైసీపీ మెజారిటీని త‌గ్గించేలా అయినా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని అంటున్నారు. ఫ‌లితంగా అసెంబ్లీలో వైసీపీ మెజారిటీని త‌గ్గించి.. తాము పైచేయి సాధించేందుకు ఛాన్స్ ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. మొత్తంగా టీడీపీ లెక్క‌లు మారుతున్నాయా? అన్న‌ట్టుగా త‌మ్ముళ్ల వ్యాఖ్య‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News