గుడ్ న్యూస్: ఆగస్టు 15కల్లా మహమ్మారి వ్యాక్సిన్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్ కు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోంది.అదీ మన భారత్ నుంచే ముందుగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత ఐసీఎంఆర్ ప్రకటించింది.
క్లినికల్ ట్రయల్స్ ను వేగవంతం చేసేందుకు భారత్ బయోటెక్ తో కలిసి పని చేయనున్నట్లు ఐసీఎంఆర్ ఈ మేరకు ప్రకటించింది.ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ట్రయల్స్ కొనసాగుతున్నాయని క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేస్తామని తెలిపారు.
డీసీజీఐ అనుమతితో ట్రయల్స్ చేస్తున్నామని.. మహమ్మారిని నివారించ గలిగితే ఆగస్టు 15వ తేదీన వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ఐసీఎంఆర్ వెల్లడించింది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ ఐసీఎంఆర్, ఫుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారం తో మహమ్మారి వైరస్ నివారణ ‘కోవ్యాక్సిన్’ను రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రీ క్లినికల్ దశ ను పూర్తి చేసి.. మొదటి, రెండో దశ పరీక్షలకు అనుమతి పొందింది. క్లినికల్ టెస్ట్ లో మహమ్మారిని నివారించ గలిగితే ఆగస్టు 15నాటికి మహమ్మారి వ్యాక్సిన్ విడుదల చేయాలని ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ భావిస్తున్నాయి.
మనుషులలో భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ పరీక్షలు విజయవంతమైతే మహమ్మారి పై సమర్థవంతమైన వ్యాక్సిన్ గా కో వ్యాక్సిన్ నిలువనుంది.