కాళ్లకు వేసుకునే చెప్పుల కొనుగోలుకు ఒక టైం ఉంటుందా?

Update: 2021-02-06 01:30 GMT
అస్సలు ఊహించని విషయం. చెప్పినంతనే చిన్నగా నవ్వి.. మరీ ఇంత మూఢ నమ్మకమా? అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది.కానీ.. అది మూఢనమ్మకం కాదు.. సైంటిఫిక్ గా తేల్చిన విషయమన్న సంగతి తెలిస్తే షాక్ తినాల్సిందే. రోజువాడే చెప్పుల్ని కొనేందుకు ఒక టైం ఉంటుందన్న విషయం చాలామందికి తెలీదు. తాజాగా ఇదే విషయాన్ని శాస్త్రీయంగా చెబుతున్నారు. చెప్పులే కదా అని చులకనగా అస్సలు చూడొద్దని.. దాన్ని సరిగా వాడేందుకు అవసరమైన చెప్పుల్ని కొనాలంటే రోజులో ఒక నిర్ణీత సమయంలోనే కొనాలన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాళ్ల సమస్యలతో ఇబ్బంది పడే వారు.. అందునా.. పాదాలు ఎప్పుడూ సమస్యలతో తల్లడిల్లే వారు అయితే.. కొనే చెప్పుల విషయంలో పక్కాగా టైం పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఎందుకలా? దాని వెనకున్న కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. చాలానే విషయాల్ని చెబుతున్నారు. నిపుణుల సలహా ప్రకారం చెప్పుల్ని ఎప్పుడూ మధ్యాహ్న సమయంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుందట.

అది కూడా మధ్యాహ్నం.. సాయంత్రం మధ్య కాలమైతే పర్ ఫెక్టుగా ఉంటుందని చెబుతున్నారు. అంటే.. మధ్యాహ్నం మూడు నుంచి ఐదు మధ్యలో అయితే మరింత బాగుంటుందని చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. గుండె సంబంధిత వ్యాధులు.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. బీపీ.. డయాబెటిస్ పేషంట్లకు సహజంగా కాళ్ల వాపులు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వారు మధ్యాహ్నం రెండు నుంచి మూడు మధ్యలో చెప్పులు కొనుగోలు చేస్తే మంచిదట. ఎందుకంటే.. కాళ్లు వాచిన సైజుకు తగ్గట్లుగా చెప్పులు తీసుకోవటం వల్ల.. సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. అనవసరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెబుతున్నారు.

కాలి సైజు కంటే చిన్నగా ఉండే చెప్పుల్ని ధరిస్తే.. అనారోగ్య సమస్యలు తలెత్తటమే కాదు.. పాదాలకు పగుళ్లు వస్తాయి. అవి దీర్ఘకాలికంగా తగ్గే అవకాశం ఉండదు. అంతేకాదు.. కాళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో టైట్ గా ఉండే షూస్ వేసుకుంటే.. గోర్ల పెరుగుదల మందగిస్తుందని.. గోటి చివర్లు వేళ్లలోకి గుచ్చుకోవట వల్ల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో పెద్ద సైజు చెప్పులతో మడమల సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. అంతేకాదు.. తరచూ కాళ్లు బెణికే అవకాశం తో పాటు.. నడకలోనే తేడా వచ్చే వీలుందని చెబుతున్నారు. ఇన్ని కారణాలతో ఎప్పుడు పడితే అప్పుడు.. ఏది పడితే ఆ చెప్పులు.. షూస్ కొనే అలవాటు ఉంటే.. వెంటనే మార్చుకోవటం మంచిదని సలహా ఇస్తున్నారు.


Tags:    

Similar News