ఈనెల 14వ తేదీన తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇదే సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరవ్వబోతున్నారు. సీఎంలు హాజరవుతున్నారంటే వివిధ రాష్ట్రాల ప్రభుత్ర ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు హాజరవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే తాజా పరిణామాల కారణంగా ఆ సమావేశం నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సమావేశం నిర్వహణే సందేహంగా మారింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళలో తుపాను కారణంగా పరిస్ధితులు మరీ ఘోరంగా తయారయ్యాయి. తుపాను ప్రభావం కారణంగానే తిరుపతిలో కూడా మూడు రోజులుగా విడవకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఇపుడు కురుస్తున్న వర్షాలు రికార్డు నమోదుచేస్తున్నాయి.
ఇక్కడే పరిస్దితి ఇలాగుంటే ఇక తమిళనాడు ప్రత్యేకించి చెన్నై పరిస్థితిని చెప్పాల్సిన అవసరం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెన్నై సిటీ మొత్తం జల సముద్రమైపోయింది. రెండు రోజులుగా చెన్నైలోని చాలా ప్రాంతాల్లో కరెంటు కూడా లేదు. తుపాను ప్రభావం, భారీ వర్షాల వల్ల చెన్నైలోని చాలా ప్రాంతాలు బాగా తినేశాయి. దెబ్బతిన్న ప్రాంతాలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిశీలిస్తున్నారు.
తుపాను, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యల్లో స్టాలిన్ బిజీగా ఉన్నారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి స్టాలిన్ హాజరయ్యే అవకాశాలు దాదాపు లేవనే అనిపిస్తోంది. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్ కూడా సహాయ చర్యల్లో బిజీగా ఉన్నారు కాబట్టి విజయన్ సమావేశానికి హాజరయ్యేది కూడా అనుమానమే అంటున్నారు. రెండు ముఖ్యమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరైతే ఇక సమావేశం నిర్వహించి ఉపయోగం లేదు.
సీఎంలు హాజరయ్యే అవకాశాలు లేవంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు+ఉన్నతాధికారులు కూడా హాజరుకానట్లే. కర్నాటక సీఎం హాజరుపై ఇంకా స్పష్టత రాలేదు. పాండిచ్చేరి సీఎం కూడా హాజరయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. తమిళనాడులో తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా సమావేశానికి వేదికైన తిరుపతిలో వాతావరణం బాగాలేదు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చాలో చోట్ల చెట్లు కూలిపోవటంతో తిరుపతిలో చాలా ప్రాంతాల్లో కరెంటు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్ధితుల్లో తిరుపతి సమావేశం జరిగేది డౌటనే అంటున్నారు.