వైసీపీ నేత‌లూ ఈ దూకుడు పార్టీకి వాడ‌రా...!

Update: 2022-08-09 04:06 GMT
మ‌ర‌క మంచిదే..అని ఒక టీవీ యాడ్‌లో చెప్పిన‌ట్టు.. నాయ‌కుల‌కు, పార్టీ నేత‌ల‌కు దూకుడు మంచిదే. అంతో ఇంతో ప‌స ఉండాల్సిందే.  ఎంత‌సేపూ.. నిదానంగా ఉంటే ప‌రిస్థితి ఏమంత బాగోదు. ఇది గ‌తం నుంచి కూడా ఉన్న‌దే. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు.. అధికార పార్టీలోను.. ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల్లోనూ.. దూకుడు ఉండాలి. అయితే.. గ‌తంలో ఈ దూకుడును ప్ర‌జ‌ల కోసం.. నాయ‌కుడు వినియోగించేవారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య‌.. కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి, టంగుటూరి ప్ర‌కాశం వంటివారు.. దూకుడుగానే రాజ‌కీయాలు.. చేశారు. దారుణ వ్యాఖ్య‌ల‌తో కాకుండా.. ద‌ర్జాగా.. ఆయా స‌మ‌స్య‌ల‌ను వెలుగు లోకి తెచ్చారు. ఈ దూకుడు.. అటు వారిని.. సుస్థిర రాజ‌కీయ నేత‌లుగా.. తీర్చిదిద్దింది. అదేస‌మ‌యంలో వారు ప్రాతినిధ్యం వ‌హించిన పార్టీల‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక దిశానిర్దేశం ఏర్పాటు చేసింది. మ‌రి ఇప్ప‌టి నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి.

అన్న‌గారు.. ఎన్టీఆర్ హ‌యాం వ‌రకు కూడా నాయ‌కుల దూకుడు బాగానే ఉంది. వారు చేసే వ్యాఖ్య‌లు.. తీ సుకునే నిర్ణ‌యాలు.. ప్ర‌జా కోణంలోనూ.. పార్టీల కోణంలోనూ ఉండేది. ఇది రెండు వైపులా వారిని అత్యుత్త మ నాయ‌కులుగా తీర్చిదిద్దిన ప‌రిస్థితులు క‌నిపించాయి.

అయితే.. రాను రాను.. ఈ ప‌రిస్థితి మారిపోయిం ది. ఎక్క‌డ ఎప్పుడు ఎలా మారిందో తెలియ‌దు కానీ.. రాజ‌కీయాలువ్య‌క్తిగ‌తంగా మారిపోయాయి. అంటే.. నాయ‌కులు వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం ప్రారంభించిన త‌ర్వాత‌.. ఈ దూకుడు.. ప‌రిస్థితి మారిపోయింది.

తాజాగా.. వైసీపీహ‌యాంలోనూ.. నాయ‌కులు దూకుడు చూపిస్తున్నారు. కానీ, ఈ దూకుడు.. వారికి వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను తీసుకురాక‌పోగా.. పార్టీ ప‌రువును.. వారి ప‌రువును కూడా గంగ‌లో క‌లిపేస్తుండ‌డ‌మే ఇప్పుడు తీవ్ర ఆవేద‌న‌కు, ఆందోళ‌న‌కు గురి చేస్తున్న ప‌రిణామం.

పోనీ.. పార్టీ కోసం.. కాక‌పోయినా.. వ్య‌క్తిగ‌తం కోస‌మైనా.. ఈ దూకుడు ప‌నిచేస్తోందా? అంటే.. అర‌గంటా లేదు.. గంటా లేదు.. ఏకంగా.. న్యూడ్ వీడియోల వ‌ర‌కు వ‌చ్చేసి.. వారిని, పార్టీని కూడా నిష్ప్ర‌యోజ‌నం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌జ‌లు పోయారు.. పార్టీ పోయింది.. ఇప్పుడు నైతికంగా..వారు కూడా ప‌త‌నం అవుతున్నారు. మ‌రి ఈ దూకుడు ఎందుకు ఉప‌యోగ‌ప‌డిన‌ట్టు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.
Tags:    

Similar News