ఎప్పుడూ లేని రీతిలో సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరికి వారు పెద్ద పెద్ద తోపులు.. పిస్తాలు అయిపోయారు. డ్రాయింగ్ రూంలో కూర్చొని నీతులు చెప్పటం.. విలువలను విప్పి చెప్పే ప్రయత్నం చేయటం.. తాము తప్పించి.. ప్రపంచంలోని వారంతా అల్ప మనస్కులుగా భావించటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఒక విషయంలో ఒక ప్రాంతం వారు గళం విప్పారంటే..అందులో ఏదో ఒక వాదన ఉంటుంది. వారిదైన లాజిక్కు ఉంటుంది. అన్నింటికి మించిన నిండైన భావోద్వేగంకూడా ఉంటుంది.
లౌకికవాదులుగా.. ప్రజాస్వామ్య వాదులుగా.. వెనుకబడిన వర్గాల వారి గురించి.. వారి హక్కుల గురించి మాట్లాడటానికే తాము జన్మించినట్లుగా కొందరు బిల్డప్ ఇస్తుంటారు. అలాంటి వారిలో కొందరైనా సరే.. తాము చెప్పే మాటలకు తగ్గట్లు తమ జీవితాల్లో ఏమైనా చేశారా? అంటే మాత్రం.. అవేమీ కనిపించవు. వారి జీవితం మొత్తంలో చేయని పనుల్ని.. వారు మాత్రం కోట్లాది మంది చేయాలని చెప్పటం ఎంతవరకు న్యాయం? మరెంతవరకు ధర్మం?
మన దేశంలో కొన్ని పదాలకు ఉండే సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. వాటికి సంబంధించి అప్పటివరకు ఉన్న భావనల్ని ప్రశ్నిస్తే చాలు.. వారిని అత్యంత దుర్మార్గుడిగానూ.. దోషిగానూ చూడటమే కాదు.. ఎలాంటి వాదనలకు అవకాశం ఇవ్వకుండానే.. వారి విషయంలో తీర్పును ఇచ్చే తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. తమ జిల్లాకు పెట్టిన కోనసీమ పేరుకు ముందు.. అందరికి సుపరిచితుడు.. మన జీవితాల్లో అను నిత్యం గుర్తుకు తెచ్చుకునే డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
నిత్యం మాట్లాడుకునే వ్యక్తుల గురించి ప్రత్యేకంగా జిల్లా ముందు పేరు పెట్టుకోవాల్సిందేనా? అలాంటప్పుడు రాష్ట్రంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో జిల్లాను ఎందుకు ఏర్పాటు చేయలేదు? అంతదాకా ఎందుకు.. ఆంధ్రప్రదేశ్ కోసం తపించి.. తమిళులతో పోరాడిన ప్రాణాలు విడిచిన పొట్టి శ్రీరాములు పేరును ఆయన జన్మించిన జిల్లాకు పెట్టేందుకు దశాబ్దాలు పట్టింది. అంతదాకా ఎందుకు.. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరును క్రిష్ణా జిల్లాకు ఎందుకు పెట్టలేదు?
అక్కడి వరకు ఎందుకు? కోనసీమ మాతృజిల్లా తూర్పుగోదావరి జిల్లా విషయానికే వస్తే.. ఆ జిల్లాకుసంబంధించి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఎవరి దాకానో ఎందుకు డొక్కా సీతమ్మకు మించిన మహనీయులు ఇంకెవరు ఉంటారు? అన్నపూర్ణగా.. ఏ వేళలో వచ్చి అడిగినా అన్నం పెట్టిన ఆ మహాతల్లి.. ఇప్పటి పాలకులకు ఎందుకు గుర్తుకు రారు?చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యపథంలో నడిపించిన కందుకూరి వీరేశలింగం పంతులుగారి పేరు జిల్లాకు ఎందుకు పెట్టకూడదు? అలానే బులసు సాంబమూర్తి.. కళా వెంకట్రావ్.. చిలకమర్తి లక్ష్మీ నరసింహరావులు కూడా ఆ జిల్లాకు తెచ్చిన వన్నె ఎంతో. అలాంటప్పుడు వారి పేర్లను ఎందుకు పరిశీలనలోకి తీసుకోకూడదు?
ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక భావోద్వేగం ఉంటుంది. దాన్ని గుర్తు ఎరిగి.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతల మీద ఉంటుంది. ఆ విషయాన్ని మరిస్తే అప్పటి వరకు శాంతమూర్తులుగా ఉన్న వారు సైతం ఆగ్రహానికి గురవుతారు. ఎవరికి వారు వారి ఇంటి పేరును ఎందుకు అమితంగా ప్రేమిస్తారు? అభిమానిస్తారు.
దేశానికి జాతిపిత అయిన గాంధీ ఇంటిపేరును ఎవరు ఎందుకు తమ ఇంటి పేరు ముందు తగిలించుకోరు? అలా తగిలించుకోకపోవటం అంటే.. జాతిపితను అవమానించినట్లే అంటే ఎంత ఎగతాళిగా.. మరెంత హస్యాస్పదంగా ఉంటుంది? ప్రపంచంలో పుట్టిన ఏ విప్లవానికైనా దానికంటూ ఒక వాదన ఉంటుంది. అలానే తీవ్రస్థాయిలో జరిగే నిరసన.. ఆందోళన వెనుక వారంతా కనెక్టు అయ్యే ఒక భావోద్వేగం ఉంటుంది. ఆ చిన్న విషయాన్ని వదిలేసి.. అనవసరం లేని విషయాలతో ముడిపెట్టి.. గోదారోళ్లు ఇలా ఉండాలి? అలా ఉండాలన్న ఉపదేశాలు మిగిలిన వారి ఆపేస్తే మంచిది. ఎవరి ఇంటి గొడవ వారు చూసుకుంటారు. అవసరం లేకున్నా.. పక్కింటి విషయాల మీద నీతులు చెప్పటం మర్యాదస్తుల లక్షణం కాదన్నది మర్చిపోకూడదు.