హోలీ పండగ వస్తుందంటే చాలు సరదాగా ఎదురుచూసే వారికి కొదవ ఉండదు. అందునా ఎన్నికల వేళ వస్తున్న హోళీ మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఇదిలా ఉంటే.. హోళీ పండగను ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జరుపుకోవటానికి వీలుగా హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తీసుకున్న నిర్ణయం మద్యం ప్రియులకు షాకింగ్ గా మారినట్లేనని చెప్పాలి.
హెలీని మరింత సేఫ్ గా జరుపుకోవటానికి..ఇతరులకు ఇబ్బంది పడకుండా చేయటం కోసం ముందస్తు జాగ్రత్తగా రేపటి నుంచి మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నియంత్రణను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి 20 నుంచి 22వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ మద్యం అమ్మకాల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో.. హైదరాబాద్ నగరంలోని అన్ని వైన్ సాపులు.. కల్లు కాంపౌండ్ లు.. బార్ అండ్ రెస్టారెంట్లు.. హోలీ నేపథ్యంలో మూసివేయనున్నారు. అంతేకాదు.. ఇతరులకు ఇబ్బందులు కలిగేలా రోడ్ల మీద వెళ్లే వారిపై రంగులు జల్లకూడదని..గుంపులుగుంపులుగా రోడ్ల మీద గుమికూడదని ఆయన ఆదేశాలుజారీ చేశారు.
మిగిలిన ఆంక్షల సంగతి ఎలా ఉన్నా.. మద్యం విషయంలో సీపీ ప్రకటించిన తాజా ఆదేశాలు మందుబాబులకు మింగుడుపడని విధంగా మారటమే కాదు.. ఎంత హోలీ అయితే మాత్రం మరీ మూడు రోజుల పాటు బంద్ పెడితే ఎలా అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రోజూ అలవాటు పడిన ప్రాణానికి ఇలా మూడు రోజులు బంద్ పెడితే ఎలా సారూ?