వైన్ షాపుల ముందు క్యూలు కట్టడం.. రద్దీ ఎక్కువగా ఉంటే ఎగబడడం మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇంటికి బంధువులు వచ్చినా.. స్నేహితులు కలిసినా వారికి మందు విందు ఇద్దామంటే వీకెండ్ లో అయితే మద్యం షాపుల ముందు రద్దీ మరీ ఎక్కువై పోతోంది. దీంతో చాలా మంది మొహమాటానికి క్యూలు కట్టకుండా మద్యం కొనకుండానే వేరే షాపులకు వెళ్లిపోతున్నారు. ఇక ఇష్టమైన బ్రాండ్ ను కూడా కొనలేక దొరికింది ఏదో తాగేస్తున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితితో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని భావించిన తెలంగాణ సర్కారు ఇప్పుడు ‘వైన్స్ సూపర్ మార్కెట్లను’ తీసుకొస్తున్నాయి. గురువారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎక్సైజ్ కొత్త పాలసీలో ‘వాక్ ఇన్ వైన్ షాపు’ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మద్యం ప్రియులకు సూపర్ కిక్ ఇచ్చే వార్త.
నవంబర్ నుంచి సూపర్ మార్కెట్ తరహాలో వాక్ ఇన్ లిక్కర్ షాపులు నగరాల్లో కొలువుదీరనున్నాయి. సూపర్ మార్కెట్లో వస్తువులను ఎలాగైతే మనం తీసుకుంటామో అలాగే ఈ వాక్ ఇన్ వైన్ షాపులలోకి వెళ్లి మద్యం ప్రియులు తమకు ఇష్టమైన బ్రాండ్ మద్యాన్ని స్టోరంతా తిరిగి కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తారు. షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాల్లోనూ ఈ వాక్ ఇన్ వైన్స్ ఏర్పాటుకు సర్కార్ నోటిఫికేషన్ వేసింది.
అయితే ఈ వాక్ ఇన్ వైన్ షాపులు ఏర్పాటు చేయాలంటే లైసెన్స్ ఫీజుతోపాటు స్పెషల్ ఎక్సైజ్ పన్నుకు అదనంగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా రూ.2.30 కోట్లు ఫీజుగా చెల్లించాలి. హైదరాబాద్ వంటి మహానగరంలో ఇదో లెక్కకాదు.. అయితే సిటీ మదుబాబులకు కిక్కు ఇచ్చే ఈ కొత్త తరహా వైన్స్ షాపుల ఏర్పాటుకు మద్యం వ్యాపారులు ఎంతవరకు ముందుకు వస్తారనేదే వేచిచూడాలి.