అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులకు ఎదురవుతున్న సమస్యల్లో ఇదో కొత్త కోణం. ఇన్నాళ్లు బెదిరింపులు, హత్యలు అనే వార్తలు వినిపించాయి. వీటిని కొందరు అతి అని ఎద్దేవా చేసినప్పటికీ అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనే వార్త ఒకింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హ్యూస్టన్ లో వుంటున్న విప్రోకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడి ఇళ్లు గుళ్ల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి బెంగళూరులో ఉన్న సంస్థ ఉద్యోగికి మెయిల్ లో అమెరికాలోని ఉద్యోగి ఆవేదన పంచుకున్నాడు. ఇంట్లో మొత్తం కొల్లగొట్టేశారని, తన పరిస్థితి తీవ్ర ఆవేదనభరితంగా ఉందని మెయిల్ లో వాపోయారు. అమెరికాలో భారతీయుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నా, అన్నీ మీడియాలో రాలేదంటూ సదరు లీక్డ్ ఈ-మెయిల్ లో అతడు వాపోయాడు. కాగా, ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరనేది తేలలేదు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించినట్లు తెలుస్తోంది.
కాగా, అమెరికాలో జరుగుతున్న వాటిని కొందరు అతిగా ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కానీ తాజా పరిణామంతో ఇది అక్కడ నెలకొన్న ఇబ్బంది కరమైన పరిస్థితుల గురించి తెరమీదకు వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/