రేవంత్ అప్పాయింట్‌మెంట్‌తో.. సీనియ‌ర్లు నేర్వాల్సిన పాఠ‌మేంటి?

Update: 2021-06-28 05:44 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూత‌న సార‌థిగా టీడీపీ మాజీ నాయ‌కుడు, ఎంపీ.. రేవంత్‌రెడ్డిని నియ‌మిస్తూ.. పార్టీ అధిష్టానం తీసుకు న్న నిర్ణ‌యం.. అనుకున్న విధంగానే సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారింది. ముఖ్యంగా సీనియ‌ర్లు తీవ్రంగా మ‌థ‌న‌ప‌డ‌డం మ‌నం చూ స్తూనే ఉన్నాం. ఏకంగా గాంధీ భ‌వ‌న్ మెట్లు ఎక్క‌ను అని కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పెద్ద శ‌ప‌థ‌మే చేశారు. అదేస‌మ‌యంలో టీపీసీసీ అమ్ముడు పోయింద‌నే న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ల‌తోనూ వేడెక్కించారు. ఇక‌, ఇత‌ర నేత‌లు.. జ‌గ్గారెడ్డి.. భ‌ట్టి విక్ర‌మార్క‌.. త‌దిత‌రులు కూడా మౌనంగానే లోలోన కుమిలిపోతున్నారనేది వాస్తవం.

అయితే.. అధిష్టానం ఇంత అనూహ్యంగా ఇలాంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకున్న‌ట్టు?  దీనివెనుక ఎలాంటి రీజ‌న్ ఉంది? ఎలాంటి వ్యూహం లేకుండానే రేవంత్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారా? అంటే.. చాలా పెద్ద వ్యూహంతోనే పార్టీ అధిష్టానం అడుగులు వేసిన ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం లెక్క‌కు మిక్కిలిగా ఉన్న సీనియ‌ర్లు.. ప‌ద‌వుల వేట‌లో ప‌డుతున్న పోరు.. చేసుకుంటున్న విమ‌ర్శ‌ల యుద్ధం ఫ‌లితంగా పార్టీ నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతోంది. తెలంగాణ వ‌స్తే.. ఖ‌చ్చితంగా ఇక్క‌డ కొన్నేళ్ల‌పాటు అధికారంలోనే ఉంటామ‌ని క‌ల‌లు క‌న్న‌.. కాంగ్రెస్‌కు ఇప్పుడు క‌నిపిస్తున్న ప‌రిణామాలు, నిజంగానే ఆత్మ‌హ‌త్యా స‌దృశం.

దీనికి రీజ‌నేంటి? అంటే.. అక్ష‌రాలా .. సీనియ‌ర్లే! రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌ర్వాత రెండు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయింది. ఇక‌,  2018 ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. టీఆర్ ఎస్‌లో చేరి మంత్రి ప‌ద‌వులు తెచ్చుకున్నారు. ఇక‌,  వ‌రుస ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజాయాలు కాంగ్రెస్‌ను మ‌రింత ఇబ్బందిలోకి నెట్టాయి. ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకుని పార్టీని న‌డిపిస్తార‌ని అధిష్టానం సీనియ‌ర్ల‌పై ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. అధిష్టానం.. వేసుకున్న అంచ‌నాల‌ను అందుకునే తీరిక సీనియ‌ర్ల‌కు లేకుండా పోయింది. సీనియ‌ర్ల మ‌ధ్య పీసీసీ పీఠం కోసం వివాదాలు రాజుకున్నాయి. ద‌రిమిలా కాంగ్రెస్‌ మ‌రిన్ని ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. అదేస‌మ‌యంలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరిట‌.. సీనియ‌ర్లు.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. మ‌రింత‌గా పార్టీని భ్ర‌ష్టుప‌ట్టించింది.

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జ‌గ్గారెడ్డి.. దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు.. ఇలా.. అనేక మంది వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీ ప‌రువును రోడ్డున ప‌డేసింది. అదేస‌మ‌యంలో అప్ప‌టి పార్టీ పీసీసీ చీఫ్‌.. ఉత్త‌మ్ కుమార్ కేంద్రంగా చేసిన రాజ‌కీయం.. వ‌ల్ల‌.. ప‌రువు పోయి.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింద‌నేది నిర్వివాదాంశం.  ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ల‌ను, పార్టీలో కొన్ని ద‌శాబ్దాలుగా పాతుకుపోయిన వారిని కూడా అధిష్టానం ల‌క్ష్య పెట్ట‌లేదు. వేరే పార్టీ నుంచి వ‌చ్చినా.. సామ‌ర్థ్యం ఉండ‌డం.. వ్యూహాల‌తో దూకుడుగా వ్య‌వ‌హ‌రించ డం, కేసీఆర్‌పై పైచేయి సాధించాల‌నే త‌ప‌న ఉండ‌డం వంటి రీజ‌న్ల‌తోపాటు.. సీనియ‌ర్ల‌కు త‌గిన గుణపాఠం చెప్పాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్ రేవంత్‌కు ప‌గ్గాలు ఇచ్చింద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా.. సీనియ‌ర్లు మార‌తారో లేదో చూడాలి.
Tags:    

Similar News