కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలపై రైతులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. రోజు రోజుకి రైతులు కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం వెనక్కి తగ్గే వరకు నిరసనలు ఆగవని రైతు సంఘాల నేతలు చెప్తుంటే , కేంద్రం మాత్రం ఆ చట్టాల వల్ల రైతులకి లాభమే కానీ నష్టం లేదు అంటూ చెప్తుంది. పలు ధపాల చర్చలు జరిపినా కూడా ఆ చర్చల్లో ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఇక రైతుల తరపున , రైతుల కోసం ఢిల్లీ , ఢిల్లీ సరిహద్దు లో కొన్ని వేలమంది రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
రైతుల హక్కుల కోసం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో భర్తలు పోరాడుతుంటే వారి భార్యలు మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. భర్తలు ఢిల్లీ పొలిమేరల్లో ఆందోళనలకు తరలిపోగా వారి భార్యలు సొంత గ్రామాల్లో వ్యవసాయ పనుల బాధ్యత చూసుకుంటున్నారు. పొలం పనులు, ఇంటి పనులు చూసుకున్నాక ప్రతీరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా తమ ఊళ్లోనే భర్త పోరాటానికి మద్దతునిస్తూ ధర్నాలో పాల్గొంటున్నారు. పంజాబ్, హరియాణాల్లో ఇటువంటి భార్యలు ఎంతోమంది తమ భర్తలను ప్రోత్సహిస్తున్నారు. రైతుల కోసం చేసే ‘ఈ పోరాటం ఆగకూడదు.
మా మగవారిని ఢిల్లీలోనే ఉండి పోరాడమని చెప్పాం. వారికి కావాల్సినవన్నీ మేం పంపుతున్నాం. ఇంటి బాధ్యతలతో పాటు వ్యవసాయం బాధ్యతలను కూడా మేమే చూసుకుంటున్నాం. దేశం కోసం యుద్దానికి వెళ్లాలి అంటే వీర తిలకం పెట్టి ఎదురొచ్చి మరీ , యుద్దానికి పంపే వీర వనితల గడ్డ .. ఈ భారతగడ్డ. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిపిన ధర్నాల్లో పంజాబ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ప్రధానంగా మహిళలే పాల్గొనడం విశేషం.