క‌డుపునొప్పి అని వెళ్తే కండోమ్ తీశారు

Update: 2016-05-27 11:14 GMT
పాశ్చాత్య దేశాల్లోని సంస్కృతికి ఇదో పచ్చి ఉదాహ‌ర‌ణ‌. అక్క‌డున్న అడ్వాన్స్ ట్రెండ్‌ - ఆత్రంతో ప్రాణం మీద‌కు తెచ్చుకున్న పైత్యానికి నిద‌ర్శ‌నం. అపెండిక్స్‌కు ఆప‌రేష‌న్ చేయించుకుంటే కండోమ్ బ‌య‌ట‌కు రావ‌డం ఈ మొత్తం వార్త‌లో ట్విస్ట్‌.

ఇంత‌కు విష‌యం ఏంటంటే కామెరూన్‌ లోని పాతికేళ్లు నిండిన ఓ యువ‌తి త‌న బాయ్‌ ఫ్రెండ్‌ తో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఆ త‌ర్వాత వారం రోజుల‌కు ఆమెకు క‌డుపులో నొప్పి - వికారం వంటివి మొద‌ల‌య్యాయి. అమ్మ‌డికి అప్పుడు ఆస్ప‌త్రి గుర్తుకు వ‌చ్చి ప‌రుగెత్తింది. అక్క‌డ ర‌క‌ర‌కాల టెస్ట్‌ లు చేసిన త‌ర్వాత అపెండిక్స్ ఉబ్బి ఉంద‌ని ఆప‌రేష‌న్ త‌ప్ప‌ద‌ని తేల్చారు. స‌రేన‌న్న త‌ర్వాత ఆప‌రేష‌న్ చేస్తే ఆ స‌మ‌యంలో డాక్ట‌ర్ల‌కు షాక్ కొట్టినంత ప‌న‌యింది.

ఆప‌రేష‌న్ స‌మ‌యంలో అపెండిక్స్‌ ను తొల‌గించేందుకు డాక్ట‌ర్లు సిద్ధ‌మ‌వుతుండ‌గా అక్క‌డ ర‌బ్బ‌రు లాంటి ప‌దార్థం ఉండ‌టం గ‌మ‌నించారు. ఏంట‌ని ప‌రీక్షించి చూసేస‌రికి కండోమ్‌!! స‌రే ఆప‌రేష‌న్ ఎలాగూ చేస్తున్నారు కాబ‌ట్టి కండోమ్‌ ను కూడా తొల‌గించారు. ఆ త‌ర్వాత అమ్మ‌డిని వివ‌రాలు అడిగితే త‌న భాయ్‌ ఫ్రెండ్‌ తో రొమాన్స్‌ లో పాల్గొన్నాన‌ని..అలా ఎంజాయ్ చేస్తున్న క్ర‌మంలో ఉప‌యోగించిన కండోమ్‌ ను మింగేశాన‌ని సెల‌విచ్చింది. నీ దుంప తెగ...శ‌రీరం పంచుకోవ‌డ‌మే కాకుండా కండోమ్ మింగేయ‌డం ఏంటే పిచ్చి మొహమా అనుకోవ‌డం డాక్ట‌ర్ల వంత‌యింద‌ట‌.
Tags:    

Similar News