వైరల్ యాడ్: బుర్జ్ ఖలీఫా పైన నిలబడి మహిళ సాహసం

Update: 2021-08-11 02:09 GMT
ప్రపంచంలోనే ఎత్తైన భవనం అది. అక్కడి ఎక్కితేనే కళ్లు తిరుగుతాయి. కిందకు చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.అంతటి ఎత్తైన భవంతిపైకి మగవాళ్లు చేరుకోవడానికి జడుసుకుంటారు. కానీ ఒక మహిళ.. విమానయాయన సంస్థలో పనిచేసే మహిళ చేరుకొని అందరికీ షాకిచ్చింది. ఈమె గుండెధైర్యానికి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

యూఏఈలోని  అతిపెద్ద విమానయాన సంస్థ  'ఫై  ఎమిరేట్స్' తమ సంస్థ ప్రమోషన్ కోసం ఎవరూ చేయని సాహసాన్ని చేసింది. ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పైన చివరి అంచుకు ఒక మహిళను ఎక్కించి  వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. అంత ఎత్తులో చేసిన ఈ ప్రకటన వైరల్ అయ్యింది. ఇది విడుదల చేసిన వెంటనే ఆ మహిళ గుండెధైర్యానికి అందరూ ప్రశంసలు కురిపించారు.

ప్రకటనలో చూపిన కంటెంట్ లో ఆమె ఎలా అంతమీదకు ఎక్కిందనేది చూపించలేదు. దీని ప్రామాణికతను ప్రజలు అనుమానించారు. ఆ లేడీ నిజంగా బుర్జ్ ఖలీఫా పైన నిలబడి ఉందా లేదా  స్పెల్-బైండింగ్ గ్రాఫిక్స్ చేశారా?  అని సోషల్ మీడియాలో అనుమానం వ్యక్తం చేశారు.

కానీ నిజంగానే ఒక మహిళా సాహసికురాలు ప్రకటన కోసం ఇంత సాహసం చేసింది. నికోల్ స్మిత్-లుడ్విక్ అనే ప్రొఫెషనల్ స్కైడైవింగ్ శిక్షకురాలు ఈ యాడ్ చేసింది. ఆమె ఎమిరేట్స్ క్యాబిన్ క్రూ లో పనిచేస్తుంటుంది. యూనిఫాంలో ధరించి బుర్జ్ ఖలీఫా పైన నిలబడి ఉండటాన్ని చూడవచ్చు.. ఇందులో ఎలాంటి మోసం లేదని మరో వీడియోను తాజాగా ఎమిరేట్స్ విడుదల చేసింది. ఆ మహిళ అంత ఎత్తుకు ఎక్కిందని వివరించింది..

నికోల్ ప్లకార్డులు పట్టుకొని అంత ఎత్తులో ఎమిరేట్స్ విమానయాన సంస్థ కోసం ప్రమోషన్ చేసింది. “యుఏఈని విశ్వవ్యాప్తం చేయడం మా లక్ష్యం.. ప్రపంచం పైన అనుభూతిని కలిగిస్తున్నాం.. ఫ్లై ఎమిరేట్స్. బాగా ఎగురుతుంది " ఆమె నికోల్  నుండి వీడియో నెమ్మదిగా జూమ్ అవుట్ అయ్యి పైకి ఎగురుతుంది. వీక్షకులు ఆమె ఎక్కడ నిలబడ్డారో చూపిస్తుంది. ఇది నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఆమె నిజంగా బుర్జ్ ఖలీఫా పైన ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

Full View
Tags:    

Similar News