డ్రంకెన్ డ్రైవ్...ఇటీవలి కాలంలో మందుబాబుల మత్తు దిగిపోయేలా చేస్తున్న పోలీసుల పరీక్షలు. మందుబాబులతో పాటు మందు భామల సంఖ్య కూడా తక్కువేం కాదనుకోండి. అర్ధరాత్రి...మిట్ట మధ్యాహ్నం అనే తేడాలేకుండా పూటుగా తాగేసి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్న మందు ప్రియులకు షాక్ ఇచ్చేలాగా దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని నగరాల్లోనూ డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. తద్వారా రోడ్లపై తాగుబోతుల ఏశాలు కాస్త తగ్గాయి. అయితే తాజాగా ఓ అమ్మడు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుకున్న పోలీసుకు ముద్దుపెట్టింది. అంతేకాకుండా కౌగిలింతల్లో ముంచెత్తింది కూడా!
కోల్ కతాలో పోలీసులు ఎప్పట్లాగే శుక్రవారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సాల్ట్ లేక్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రోడ్డు మీద పాములాగా మెలికలు తిరుగుతున్న ఓ కారు అదుపు తప్పి దగ్గర్లో ఉన్న టాక్సి డ్రైవర్‌ను గుద్దేయడం గమనించారు. పాపం ఆ డ్రైవర్ తనను గుద్దినప్పటికీ ఆమెను రక్షించే ప్రయత్నం చేసేందుకు ముందుకు రాగా ఆ తాగుబోతు లేడి ఆయన్ను తోసిపడేసింది. ఈ పరిణామాలు గమనించిన పోలీసులు ఆ మందు తాగిన మహిళ వద్దకు వెళ్లి కారులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు.
అయితే ముప్పై ఏళ్ల వయసులో ఉన్న ఆ మహిళ ఆ పోలీసుకు ముద్దులు పెట్టేస్తూ...కౌగిలింతల్లో ముంచేస్తోంది. దీంతో అవాక్కవడం సదరు పోలీసు వంతు అయింది. ఇక లాభం లేదనుకొని అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సహాయంతో ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం ఆ కారులో ఆమెతో పాటు మరో పురుషుడు కూడా ఉన్నాడు. పూటుగా తాగిన ఆ ఇద్దరు ఓ పార్టీ నుంచి తిరిగి వస్తున్నట్లు తేలింది.