కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాతో బాధపడుతున్న ఓ రోగి వద్దకు ఓ మహిళ వచ్చింది. చేతిలో కొబ్బరి నూనెను పట్టుకొని వచ్చింది. తనకు తెలిసిన ఓ రోగికి కొబ్బరి నూనె రాసి స్వాంతన చేకూరాలని ప్రార్థన చేసింది.అయితే అందులోని ఓ రోగి బంధువు దీనిపై మహిళను నిలదీశాడు. ఆ కొబ్బరి నూనె ఒకరి తర్వాత ఒకరికి అందరికీ రాస్తే బయట కూడా వ్యాపిస్తుందని.. బయట ఉంటే లోపల వ్యాపిస్తుందని.. ఇలా ప్రార్థన చేస్తే కరోనా తగ్గుతుందా ? అని నిలదీశాడు.
కొబ్బరినూనె రాసి ప్రార్థన చేయడం వల్ల కరోనా తగ్గుతుందా? అలా తగ్గితే ఇంత మంది వైద్యులు, సిబ్బంది ఎందుకని రోగి బంధువు ఒకరు నిలదీశారు. అయితే మహిళ మాత్రం తమ వారి కోసం వచ్చానని.. వారు బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థించడం తప్పా? అని నిలదీసింది. వీరిద్దరి సంవాదం వీడియోలో రికార్డ్ కావడంతో వైరల్ అయ్యింది.
Full View