ఓ పక్క కొద్దిసేపట్లో తల్లి కాబోతున్నానన్న ఆనందం. మరోపక్క చుట్టుముట్టిన సింహాలతో పొంచి ఉన్న ప్రాణభయం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లాలో జరిగింది.
లునసాపూర్ గ్రామానికి చెందిన మంగూబెన్ మక్వానా(32) అనే మహిళకు గురువారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను 108 వాహనంలో దగ్గరలో ఉన్న జఫరాబాద్ ఆస్పత్రికి తరలింస్తున్నారు. సింహాలకు ప్రసిద్ధి గాంచిన గిర్ అటవీ ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్న సమయంలో మహిళకు నొప్పులు ఎక్కువయ్యాయి.
అది గమనించిన టెక్నీషియన్ అశోక్ వాహనాన్ని ఆపాడు. ఆ మహిళ పరిస్థితిని వివరించడానికి 108 ఎగ్జిక్యూటివ్ హెడ్ చేతన్ కు ఫోన్ చేశాడు. సరిగ్గా ఇదే సమయానికి 12 సింహాలు అంబులెన్స్ ను చుట్టుముట్టాయి. సింహాలను వెళ్లగొట్టడానికి డ్రైవర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టెక్నీషియన్ ఫోన్ ద్వారా చేతన్ సలహాలు తీసుకుని మహిళకు పురుడు పోశాడు.
డ్రైవర్ పదేపదే లైట్లు వేసి, హారన్ మోగిస్తుండడంతో సింహాలు కొద్ది సేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో తల్లీబిడ్డలను జఫరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని చేతన్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/