కొన్ని సంఘటనలు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అంతేగాక ఎంతో ఆసక్తిగానూ ఉంటాయి, పోయిన వస్తువు ఎప్పుడో ఎన్నో ఏళ్ల తర్వాత దొరికితే.. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది! అది కూడా మన కొడుకుకో - కూతురుకో - కోడలికో దొరికితే అప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు! ఇలాంటి ఆనందంలోనే ఒక బామ్మ మునిగి తేలిపోతోంది. ఎప్పుడో 13ఏళ్ల కిందట పాడేసుకున్నఎంగేజ్ మెంట్ రింగ్.. దొరికినందుకు ఒక బామ్మ తెగ సంబరపడిపోతోంది. అది కూడా ఒక క్యారెట్ మూలంగా దొరకడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం!! ఈ విచిత్ర సంఘటన కెనడాలో జరిగింది.
పెళ్లిళ్లలో ఒక్కొక్కరి సంప్రదాయం ప్రకారం పాటిస్తారు. కొందరు తాళి కడితే.. మరికొందరు రింగ్ తొడుగుతారు. ముఖ్యంగా పాశ్చాత్యులకి.. రింగ్ ఎంతో విలువైనది. అదీగాక ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటే అందరికీ స్పెషల్ కదా! ఇప్పుడు కెనడాకు చెందిన మేరీ గ్రామ్స్ తన ఎంగేజ్ మెంట్ రింగ్ ను 13 ఏళ్ల కిందట పొగొట్టుకుంది. ఇంటి ఆవరణలోని గార్డెన్ లో కలుపు తీస్తుండగా ఎంతో ఇష్టంగా ధరించిన రింగ్ కనిపించకుండా పోయింది. గార్డెన్ లో ఎన్నో రోజులు వెతికినా చివరకు దొరక్క పోవడంతో దానిపై ఆశలు వదిలేసుకుంది. తన కొడుకుతో ఈ విషయాన్ని చెప్పింది.
అల్బర్టాలోని అర్మెనా సమీపంలో ఒకప్పుడు మేరీ గ్రామ్స్ నివాసం ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఆమె కుమారుడు క్యారెట్ పంట వేశాడు. కోడలు కొలీన్ డలే క్యారెట్లను సేకరించడానికి వెళ్లినప్పుడు ఆమెకు ఒక వింత ఆకృతిలో పెరుగుతున్న ఓ క్యారెట్ కనిపించింది. ఏదో పాడైన క్యారెట్ గా భావించి పక్కన పడేయాలనుకున్నా.. చివరకు తనతో తీసుకువెళ్లింది. ఆ క్యారెట్ ను శుభ్రం చేస్తుండగా అందులో రింగ్ ఉందని గుర్తించి తన భర్తకు ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే రింగ్ దొరికిన విషయాన్ని తల్లికి చెప్పాడు.
ఇంకేముంది ఎప్పుడో పోయిన రింగ్ దొరకడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి, కుటుంబసభ్యులు అందరూ చూస్తుండగానే సబ్బుతో శుభ్రం చేసి వెంటనే దానిని ధరించింది. తన భర్త ఎంగేజ్ మెంట్ సమయంలో తనకిచ్చినప్పుటికన్నా ఇప్పుడు చాలా సులువుగా వేలికి పట్టిందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. మరి దేనికైనా అదృష్టం ఉండాలంటారు.